అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) - సురేందర్ రెడ్డి  కాంబోలో వస్తున్న స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఏజెంట్’. న్యూ ఇయర్ స్పెషల్ గా చిత్ర యూనిట్ అదిరిపోయే మేకింగ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.  

అక్కినేని నటవారసుడు, యంగ్ హీరో అఖిల్ (Akkineni Akhil) తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో క్లాస్ హిట్ ను అందుకున్నాడు అఖిల్. ఇక Agentతో మాస్ హిట్ ను సొంతం చేసుకునేందుకు మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో 2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ మధ్య ‘ఏజెంట్’ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. దీంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఇయర్ స్పెషల్ గా అదిరిపోయే యాక్షన్ ప్యాక్డ్ మేకింగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. అఖిల్ ను సరికొత్తగా చూపించేందుకు చిత్ర యూనిట్ ఎంతలా కష్టపడుతోందో అర్థమవుతోంది. లేటెస్ట్ గ్లింప్స్ లో అఖిల్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్ చిత్రీకరించే విధానం ఆకట్టుకుంటోంది. 30 సెకండ్లు ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

చిత్రంలో అఖిల్ - సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండుగా మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలోనూ డబ్డ్ వెర్షన్‌ లో విడుదల కానుంది. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 

Scroll to load tweet…