సిగ్గు లేకుండా అడుగుతున్నా మందు తాగనా ... జగపతి బాబు పోస్ట్ వైరల్ 


నటుడు జగపతి బాబు బర్త్ డే నేడు. ముక్కుసూటిగా ఉండే ఆయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. మద్యం తాగమంటారా అని ఫ్యాన్స్ ని అడిగాడు. 
 

acotr jagapathi babu celebrates his birth day in style ksr

విబి రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నిర్మాత. ఎన్నో చిత్రాలు నిర్మించారు. కొడుకు జగపతి బాబును హీరోగా  చేశారు. మాస్ కమర్షియల్ హీరోని చేద్దాం అనుకుంటే అది కుదరలేదు. ఫ్యామిలీ హీరో అయ్యాక జగపతి బాబు సక్సెస్ అయ్యాడు. ఆయన వందకు పైగా చిత్రాల్లో నటించాడు. జగపతి బాబు కెరీర్ మెల్లగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. దాంతో చేసేదేమి లేక విలన్ రోల్స్ ట్రై చేశాడు. లెజెండ్  మూవీలో ప్రధాన విలన్ రోల్ చేశాడు. 

లెజెండ్ జగపతి బాబు కెరీర్ మార్చేసింది. ఆయన్ని స్టార్ చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా క్రేజీ యాక్టర్స్ లో జగపతి బాబు ఒకరు. ఆయన సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఒక్కరోజుకు జగపతి బాబు రూ . 10 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. హీరోగా కంటే కూడా విలన్ గా జగపతి బాబు సంపాదిస్తున్నాడు. 

కాగా నేడు జగపతి బాబు బర్త్ డే. దీంతో ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఒక చేతిలో ఎనర్జీ డ్రింక్, మరొక చేతిలో ఆల్కహాల్ తో ఫోటో పోస్ట్ చేసాడు. ఎలాగొలా పుట్టేశాను. ఈ రెండింటిలో ఏది తాగమంటారని కామెంట్ చేశాడు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండు మిక్స్ చేసి తాగమని కొందరు సలహా ఇస్తున్నారు. బర్త్ డే వేళా ఒక ఫేమ్ ఉన్న నటుడు మందు బాటిల్స్ ప్రదర్శించాడు. కాగా నెక్స్ట్ జగపతి బాబు ఒక సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. 

జగపతి బాబు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడతారు. నాకు జూదం, మందు వ్యసనం ఉందని గతంలోనే చెప్పాడు. ఒక దశలో జగపతి బాబు నిలువ నీడలేక ఇబ్బంది పడ్డారట. తండ్రి సంపాదించిన ఆస్తులు కరిగించేశారట. విలన్ గా టర్న్ తీసుకున్నాక జగపతి బాబు కెరీర్ ఊపందుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios