కరోనా దెబ్బతో  కొత్త  సినిమాల షెడ్యూళ్లన్నీ తేడా కొట్టేశాయి.మొన్న సోలో బ్రతుకే సో బెటర్ వచ్చేదాకా దాదాపు తొమ్మిది నెలల పాటు కొత్త సినిమాల విడుదల లేదు. షూటింగ్‌లూ ఆగిపోయాయి.  షెడ్యూల్ ప్రకారం అనుకున్న ఏ సినిమా రిలీజ్ కాలేదు. భవిష్యత్ ప్రాజెక్టులన్నీ కూడా అటు ఇటు అయిపోయాయి. దీంతో సంక్రాంతిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత అందరి దృష్టీ మెగా బ్రదర్శ్ సినిమాలు వకీల్ సాబ్, ఆచార్య మీదే ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు సమ్మర్ కు రిలీజ్ డేట్స్ పెట్టుకున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్స్ ఇచ్చిన రోజునే రిలీజ్ చేయబోతున్నారు.

 అనుకున్న ప్రకారం జరిగితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ మే 9న రిలీజ్ అవుతుంది. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు రిలీజ్ అయ్యిన లక్కీ డేట్. 1990,1991లలో  అదే తేదీన సినిమాలు రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసాయి. 

ఇక 2021కి తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల విరామం తర్వాత రాబోతున్న సినిమా ఇది. కరోనా లేకుంటే ఈ ఏడాది వేసవిలోనే సందడి చేయాల్సిన చిత్రమిది. వైరస్ తెచ్చిన విరామం వల్ల ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యమైంది. ఈ సినిమాని చిరంజీవి సూపర్ హిట్ ఘరానా మొగడు రిలీజ్ రోజైన ఏప్రియల్ 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 
 
 ఈ లోపు థియేటర్లు పూర్తిగా తెరుచుకోవాలి. ఒకప్పట్లా 100 శాతం ఆక్యుపెన్సీతో నడవాలి. అలా అయితే తప్ప ఈ సినిమా బడ్జెట్లు వర్కవుట్ కాకపోకపోవచ్చు. మరోవైపు ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను కూడా వేసవిలోనే విడుదల చేయొచ్చని అంటున్నారు.  ‘ఆర్ఆర్ఆర్’ సంగతేంటన్నది ఇంకా తేలలేదు. షూటింగ్ స్పీడ్  ప్రకారం చూస్తే అది వచ్చే ఏడాది ద్వితీయార్దంలో కానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.