రీసెంట్ గా విడుదలైన ఏడు చేపల కథ సినిమాలో సెన్సేషన్‌ సృష్టించాడు అభిషేక్‌ రెడ్డి.  అంతకు ముందు ఎప్పుడూ టాలీవుడ్ కలలో కూడా ఊహించని  బోల్డ్‌ క్యారెక్టర్‌తో షాక్‌ ఇచ్చిన అభిషేక్‌, ఈ సినిమాతో తను ఎక్సెపెక్ట్ చేసిన కమర్షియల్  సక్సెస్ సాధించాడు.  ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ రాకపోయినా కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి.దాంతో ఇప్పుడు అదే ఊపులో మరో సినిమాతో పలకరించటానికి సిద్దపడ్డాడు.

వైఫ్‌ ఐ  అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఏడు చేపల కథ తరహాలోనే బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిందని అర్దమవుతోంది.  నైఫ్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ వైఫ్‌ అనై ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బోల్డ్ కంటెంట్‌ కారణంగా ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేటే వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

ఈ ట్రైలర్ ఆరంభం లో అభిషేక్ రెడ్డి ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు.. అక్కడున్న పోలీస్ తో 'కంప్లయింటు.." అంటాడు. ఆ పోలీస్ ఫోన్ లో మాట్లాడుతూ  'కూచొ' అంటాడు. "వైఫ్.. మిస్సింగ్ సర్" అంటూ ఇంట్రస్టింగ్ గా  తన వెర్షన్ చెప్తాడు.  "ఇల్లీగల్ ఎఫైర్స్ ఏవైనా ఉన్నాయా?" అని పోలీస్ అడగగానే అభిషేక్-గుంజన్ మధ్య జరిగిన కొన్ని  బోల్డ్ షాట్స్ వస్తాయి. అంటే ఏదో హాట్ కంటెంట్ ఉందని క్లూ ఇస్తున్నారన్నమాట. మొత్తానికి ట్రైలర్  ను ఇంట్రెస్టింగ్ గానే కట్ చేశారని చెప్పాలి. గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్.