బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మొదటి  నుండి ఓ బ్యాచ్ కోసం బయట కొందరు భయంకరమైన క్యాంపైన్ చేస్తున్నారు.ఆ బ్యాచ్ ఎవరంటే లాస్య, అభిజిత్, హారిక.  హౌస్ నుండి ఆరోగ్య కారణాల రీత్యా ఎలిమినేట్ కాకుండానే బయటికి వచ్చిన నోయల్  సైతం అభిజీత్, హారిక మరియు లాస్య టైటిల్ గెలుపొందేలా బయట కృషి చేస్తానని చెప్పారు. ఇక హౌస్ లో కూడా వీరందరూ చాల క్లోజ్ గా ఉంటూ, నామినేషన్స్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. సేఫ్ గేమ్ ఆడుతూ ఎటువంటి ప్రత్యేక చూపకుండా హౌస్ లో ఉంటున్న లాస్యను, చివరికి ప్రేక్షకులే ఇంటికి పంపివేశారు. 

కాగా ప్రముఖ యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అభిజిత్ కోసం చాలా కష్టపడుతున్నారు. అతన్ని ఎలాగైనా బిగ్ బాస్ విన్నర్ ని చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తన అభిజిత్ కజిన్ కావడంతో, యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలెబ్రిటీలను పిలిచి, అభిజీత్ ఈజ్ గ్రేట్ అని చెప్పేలా చేస్తున్నారు. దివాళి సంధర్భముగా యాంకర్ వర్షిణి మరియు వాళ్ళ సిస్టర్ ని గెస్ట్స్ గా రవి తన ఛానల్ కి పిలిచారు. వాళ్లిద్దరూ అభిజీత్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్ అని చెప్పారు. 

తాజాగా హౌస్ లో మిత్రులుగా ఉంటున్న అభిజీత్, హరికల మదర్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అభిజీత్, హరికల క్వాలిటీస్ గురించి ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్ ఓ ఉన్నాయి. యాంకర్ రవి అయితే ప్రేక్షకులు బిగ్ బాస్ విన్నర్ గా అభిజీత్ అని తీర్పు ఇచ్చేశారని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అదే ప్రయత్నంలో హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని విలన్ ని చేసే ప్రయత్నం కూడా చేశారు. 

హౌస్ లో అభిజీత్ హీరో, హారిక హీరోయిన్ అయితే విలన్ ఎవరో చెప్పాలని రవి అభిజిత్ తల్లిని అడిగారు. తన దృష్టిలో వీరిద్దరి కథలో విలన్స్ అఖిల్, మరియు అమ్మ రాజశేఖర్ అని చెప్పారు. అమ్మ రాజశేఖర్ ప్రస్తుతం హౌస్ లో లేరు. అఖిల్ విలన్ అని చెప్పడం ద్వారా తన ఇమేజ్ ని దెబ్బగొట్టే ప్రయత్నం చేశారు.