నేడు శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగిపోయాడు. ఇక ఈ వారం మొత్తం హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, సంభాషణలపై రివ్యూ మొదలుపెట్టారు. గత వారం బిగ్ టాస్క్ లో భాగంగా అఖిల్ ని హౌస్ లోని సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఇంటి సభ్యులు అందరూ అఖిల్ హౌస్ నుండి పూర్తిగా బయటికి వెళ్లిపోయారని భావించారు. అఖిల్ ని సీక్రెట్ రూమ్ లో ఉంచి తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో చూపించాడు. 

అఖిల్ పై అభిజిత్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయగా...హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన అఖిల్ నామినేషన్స్ లో అభిజిత్ గురించి ఓ కథ చెప్పాడు. మేకలా బయటికి వెళ్లిన నేను పులిలా తిరిగి వచ్చానని అన్నాడు. దానికి అభిజిత్ మేక ఎప్పటికీ పులికాదు, బలి అవుతుందని కౌంటర్ వేశాడు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడడం జరిగింది. 

కాగా శనివారం నాగార్జున ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నాగార్జున ముందు ఇద్దరూ వివరణకు దిగారు. నేను లేకుండా నాపై కామెంట్స్ చేశాడని అఖిల్, అభిజిత్ పై ఆరోపణ చేశారు. నీ ముందైనా అంటాను అని అభిజిత్ ఆన్సర్ ఇచ్చాడు. నీ లక్ బాగుంది మళ్ళీ లోపలికి వచ్చావ్ అని అభిజిత్ అన్నాడు. నాగార్జున కూడా అవును బయటికి వెళ్లిన వారు తిరిగి రాలేదని అన్నారు. మీముందు ఒకలా, అప్పుడు మరోలా అభిజిత్ మాట్లాడాడని అఖిల్ అన్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో అఖిల్ మరియు అభిజిత్ మధ్య వాడివేడి చర్చ నడిచింది.