Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ లుక్ లో స్టార్ హీరో కొడుకు...అతనేనా ఇతను??

మహారాజా టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అందులోదే ఈ గెటప్ అంటున్నారు. 1862 నేపధ్యంలో సాగే ఈ కథలో

Aamir Khan Son Junaid Steps Out In Heavy Makeup jsp
Author
First Published Apr 11, 2024, 4:20 PM IST


తెరపై కనిపించేప్పుడు ఎలా ఉంటారో స్టార్స్, వారి వారసలు తెర వెనక కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సి ఉండాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వర్కవుట్ కాదు. జనాలు ఎప్పటికప్పుడు ట్రోలింగ్ చెయ్యటానికి సిద్దంగా ఉంటారు. అలాగే తేడాకొట్టిన ఫొటోలను,వీడియోలను వైరల్ చేస్తూంటారు. ప్రస్తుతం మిస్టర్ ఫెరఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అంతటా వైరల్ అవుతోంది. 
 
 బాలీవుడ్ లో త్వరలో చక్రం తిప్పే స్దాయికి వెళ్తాడు అనుకున్న ఈ  స్టార్ హీరో కొడుకు ఇప్పుడు ఇలా ట్రోల్ కు గురి అవటం షాక్ కు గురి చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు అయిన జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య రీనా దత్తాల కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైంది. 

మహారాజా టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అందులోదే ఈ గెటప్ అంటున్నారు. 1862 నేపధ్యంలో సాగే ఈ కథలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్ద యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Aamir Khan Son Junaid Steps Out In Heavy Makeup jsp

ప్రస్తుతం జునైద్ థియేటర్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటూనే.. మరో పక్క స్టేజ్ డ్రామాలు వేస్తున్నాడు.  ఒక నాటకం కోసం ఆసక్తికరమైన పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. అదే హిజ్రా పాత్ర అంటున్నారు. స్ట్రిక్ట్‌లీ అన్‌కన్వెన్షనల్ అనే నాటకంలో జునైద్ ఖాన్ హిజ్రా పాత్రలో కనిపించాడు. నవంబర్ నెల 15వ తేదీ సాయంత్రం ముంబై లోని పృథ్వీ థియేటర్‌లో జునైద్ తన తొలి ప్రదర్శనకు ఇచ్చాడు. ఇప్పటికే పలు నాటకాలలో స్టేజి అనుభవం ఉన్న ఈ స్టార్ హీరో కొడుకు ఇప్పుడు ఇలాంటి నాటకంతో రెడీ అవుతుండడంతో అభిమానులు దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరో ప్రక్క ఈ గెటప్ లుక్ ఏమిటనేది ఫ్యాన్స్ కు అంతుచిక్కని ప్రశ్నలా మారింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios