రిలీజ్ కు  ముస్తాబు అవుతోంది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ. నాగచైతన్య కీ రోల్ పోషించిన ఈ సినిమా ఓ పాపులర్ ఓటీటీ సంస్థతో భారీ డీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన సినిమా లాల్ సింగ్ చ‌డ్డా . టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కీ రోల్ లో చైతూ కనిపించబోతున్నాడు. తెలుగులో ఈసినిమానుమెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నాడు. వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, పారామౌంట్‌ పిక్చ‌ర్స్ తో కలిసి అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ లో అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఇక వచ్చే నెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది మూవీ. 

రిలీజ్ కు రెడీ వుతున్న టైమ్ లోనే ఈమూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. లాల్ సింగ్ చడ్డా పోస్ట్ థ్రియాట్రిక‌ల్ రైట్స్‌ను పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట‌. దీనికోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టింద‌ని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. లాల్ సింగ్ చడ్డా రిలీజ్ అయిన కొన్ని వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్ లో సంద‌డి చేయడానికి రెడీగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మూవీ టీమ్ నుంచి కాని.. మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

లాల్ సింగ్ చడ్డా హాలీవుడ్ క్లాసిక్ ప్రాజెక్టు ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా తెరకెక్కింది. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లకు పదును పెట్టారు మూవీ టీమ్. రీసెంట్ గా నాగచైతన్య థాంక్యూ రిలీజ్ అయ్యింది.ఇక చైతూ కూడా ఫ్రీ అయిపోయడు దాంతో వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే ఈసినిమాను ప్రముఖులు చూశారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన ఇంట్లో స్పెషల్ షోను ప్రదర్శించారు. సినిమా చూసిన చిరంజీవి అమీర్ ఖాన్ ను హగ్ చేసుకుని మరీ అభినందించారు. 

ఇక ఈసినిమాలో అమీర్ జోడీగా అందాల భామ క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా నటించింది. అంతే కాదు బాలీవుడ్ లో చాలా గ్యాప్ తరువాత అమీర్ ఖాన్ చేస్తున్న సినిమా కావ‌డంతో అభిమానుల నుంచి, ఆడియన్స్ నుంచి సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అమీర్ సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మంచి ఆకలి మీద ఉన్నారు. మరి లాల్ సింగ్ చడ్డా.. అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి మూవీ అవుతుందా..? చూడాలి మరి.