ఈ మధ్యకాలంలో విడుదలై ఘాన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో 'RX100' ఒకటి. ఈ సినిమాతో పరిచమైన హీరో కార్తికేయకి, దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకు మంచి పేరు లభించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ రీమేక్ లో ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఆది ప్రస్తుతం 'యు టర్న్' సినిమాలో నటిస్తున్నాడు.

అలానే సోలో హీరోగా నటించిన 'నీవెవరో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆది పినిశెట్టి 'RX100' తమిళ రీమేక్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఔరా సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.