హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ఆదా శర్మ. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా అమ్మడికి అందం అనే క్యాటగిరిలో మంచి మార్కులే పడ్డాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను ఏ మాత్రం మిస్ చేసుకోకుండా కెరీర్ ను బాగానే నెట్టుకొస్తోంది. అయితే ఎంత కష్టపడినా కూడా ఆఫర్స్ స్థాయి పెరగడం లేదు. 

అందుకే ఈ మధ్య ఫోటో షూట్స్ తో బేబీ హాట్ గా దర్శనమిస్తోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రోజుకో లుక్ తో డిఫరెంట్ స్టైల్ లో తన అందాలను ప్రజెంట్ చేస్తోంది. దీంతో బేబీపై కోలీవుడ్ ద్రుష్టి గట్టిగా పడినట్లు సమాచారం. త్వరలోనే ఓ రెండు సినిమాలకు ఆదా శర్మ సైన్ చేయబోతున్నట్లు టాక్. ఫోటో షూట్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఆదా అవకాశాలను అందుకుంటూ అందరికి ఒక మెస్సేజ్ చేస్తోంది. 

అదే విధంగా యాడ్స్ లో నటించే అవకాశం కూడా వస్తుందట. గతంలో కొన్ని ప్రముఖ యాడ్స్ లలో ఆదా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమాలలో నటించే అవకాశం కూడా దక్కించుకుంటోంది. విక్రమ్ - విశాల్ వంటి అప్ కమింగ్ సినిమాల్లో ఆదా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.