రవితేజ రెమ్యునేషన్ ఇష్యూ పరిష్కారం
ఈ క్రమంలో కొన్ని మంచి ప్రాజెక్టులు కూడా ప్రక్కకు వెళ్లిపోతున్నాయి. ఈ నేపధ్యంలో రవితేజ ఆలోచించి ఓ పరిష్కారానికి వచ్చారని అంటున్నారు. అది నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు.
మాస్ మహారాజా రవితేజ రెమ్యునేషన్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో వినపడుతోంది. ఆ మధ్యన వరుస ప్లాపులు పడటంతో రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు రెడీ అయ్యాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ క్రాక్ హిట్ అవటంతో ఒక్కసారిగా పెంచేసారు అన్నారు. ఇలా ఏదో వంకన రవితేజ రెమ్యునేషన్ గురించి మాటలు నడుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అయితే రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో ఒక నెంబర్ చెప్తే అది నిర్మాతలు ఇవ్వాల్సిందే అన్నట్లు ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్దితి రిపీట్ అంటున్నారు. దాంతో అంతంత రెమ్యునేషన్ ఇచ్చుకోలేక ఆయనతో బేరసారాలు మొదలెట్టడం జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని మంచి ప్రాజెక్టులు కూడా ప్రక్కకు వెళ్లిపోతున్నాయి. ఈ నేపధ్యంలో రవితేజ ఆలోచించి ఓ పరిష్కారానికి వచ్చారని అంటున్నారు. అది నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు.
అదేమిటంటే..రవితేజ ఇక నుంచి లాభాల్లో వాటా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ మేరకు తన రెమ్యునేషన్ ని ఎడ్జెస్ట్మెంట్ చేస్తారట. దాంతో రవితేజకు సినిమా రిలీజ్ కు ముందు ఇవ్వాల్సిన మొత్తం బాగా తగ్గిపోతోంది. ఆ మొత్తం నిర్మాతకు పెట్టుబడిగా పనికొస్తుంది. ప్రొడక్షన్ హౌస్,రవితేజ టీమ్ కలిసి ఈ విషయమై ఎంత షేర్,ఎలా తీసుకోవాలి అనేది కసరత్తు చేసి,పార్టనర్ షిప్ గా ఉంటారు. తాజాగా రవితేజ చేయబోయే సినిమాకు సైతం ఇదే అప్లై చేస్తున్నారని సమాచారం. ఈ రోజు నుంచే హైదరాబాద్ లో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం అవుతోంది. అలాగే తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశ పరుస్తూ ఉండడంతో తన కొత్త సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకొదలుచుకోలేదట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దర్శకుడుకి సూచించాడట. దీంతో రవితేజ సూచించిన మార్పుచేర్పులను చేసే షూటింగ్ మొదలెడుతున్నారట.
ఇక రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేస్తూ సినిమా షూటింగ్ ప్రారంభం ‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రీ లుక్ లో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండడం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడం ఆసక్తికరంగా మారింది. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్‌గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రవితేజ ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నారు. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు స్వరకర్త సామ్ సిఎస్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్.