టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవే. చిరంజీవి స్టైల్ గా డ్యాన్స్ చేస్తుంటే ఆ గ్రేస్ కి అభిమానులు కేరింతలు కొట్టేవారు.

టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవే. చిరంజీవి స్టైల్ గా డ్యాన్స్ చేస్తుంటే ఆ గ్రేస్ కి అభిమానులు కేరింతలు కొట్టేవారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేనమామ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ బన్నీ డ్యాన్స్ లో చెలరేగిపోయాడు. ఇప్పుడు నటుడిగా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. 

చిరంజీవికి తాను ఎంతటి అభిమానో బన్నీ పలు సందర్భాల్లో వివరించాడు. కానీ చిరంజీవి వల్ల అల్లు అర్జున్ ఓ సందర్భంలో రూ.25 వేలు నష్టపోయాడట. ఓ సందర్భంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. ఇంద్ర మూవీ టైంలో ఈ సంఘటన జరిగిందట. నా స్నేహితుడితో ఇంద్ర చిత్రం గురించి మాట్లాడుతుండగా.. మెగాస్టార్ వేసిన వీణ స్టెప్ గురించి ప్రస్తావన వచ్చింది. ఆ స్టెప్ ని చిరంజీవి సోలోగా వేశారని మా ఫ్రెండ్ కి చెప్పా. లేదు చిరంజీవి పక్కన సోనాలి బింద్రే కూడా ఉందని మా ఫ్రెండ్ వాదించాడు. 

నేను 17 సార్లు చిరంజీవి వీణ స్టెప్ చూశా. నాకు చిరంజీవి ఒక్కరే కనిపించారు అని మా ఫ్రెండ్ తో పాతిక వేలు పందెం కాసాను. వీడియో చూస్తే చిరంజీవి పక్కన సోనాలి బింద్రే కూడా ఉంది. దీనితో తాను 25 వేలు నష్టపోవాల్సి వచ్చింది అని బన్నీ తెలిపాడు. చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే ఆయన పక్కన 100 మంది ఉన్నా తనకి కనిపించరు అని.. నా చూపు మెగాస్టార్ డ్యాన్స్ పై మాత్రమే ఉంటుందని తన అభిమానాన్ని బన్నీ బయట పెట్టాడు. 

చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే అభిమానుల చూపు ఆయనపైనే ఉంటుంది. అది నిజమే.. కానీ వీణ స్టెప్ వేసే సమయంలో సోనాలి బింద్రే నాజూకు నడుముతో వయ్యారంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఇంద్ర చిత్రాన్ని అన్ని సార్లు చూసిన బన్నీ ఒక్కసారి కూడా సోనాలిని గమనించక పోవడం విచిత్రమే.