వరుస అపజయాలను ఎదుర్కొంటున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని మరో యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతున్నాడు. ఇక చిత్ర యూనిట్ నేడు సినిమాకు సంబందించిన ట్రైలర్ ను లాంచ్ చేసింది. కళ్యాణ్ రామ్ మరోసారి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. 

కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే - నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక సీనియర్ సినిమాటోగ్రాఫర్ కెవి.గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా తప్పకుండా సరికొత్త విజువల్ ట్రీట్ తో పాటు మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చూసిన అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. సినిమా ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..