బూతు సినిమాల హవా మళ్లీ మొదలైంది. ఆ మధ్యన వచ్చిన ఆర్ ఎక్స్ 100 హిట్ అవటంతో ఈ తరహా సినిమాలు జోరందుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆర్ డి ఎక్స్ లవ్ సినిమా కూడా ఇలాంటి బూతుని నమ్మకునే వచ్చి బలైపోయింది. ఇప్పుడు మరో సినిమా అలాంటి కంటెంట్ తో మరింత హాట్ గా తెరకెక్కిందని చెప్తూ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ని ఇయిర్ ఫోన్స్ పెట్టుకుని, పిల్లలు లేనప్పుడు చూస్తే బెస్ట్ అని నెట్ జన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గుర్తుందో లేదో ..కొద్ది నెలల క్రితం ‘ఏడు చేపల కథ’ అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది గుర్తుందా? ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’అంటూ టెంప్ట్ రవి చెప్పిన డైలాగులుకు, కుర్రాళ్లు తెగ కనెక్ట్ అయ్యిపోయి...  ఆ టీజర్‌ ని  సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసారు.  అయితే ఏ సమస్యలు వచ్చాయో ఏమో కానీ ఇన్నాళ్లూ దాని గురించే ఎవరూ మాట్లాడలేదు. అలాంటిది హఠాత్తుగా ఈ చిత్రం ట్రైలర్ రంగంలోకి దూకింది. ఈ ట్రైలర్ ..టీజర్ ని మించిపోయింది.

అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘ఏడు చేపల కథ’. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో సాఫ్ట్ పోర్న్ సినిమాలా ఉందంటున్నారు.   ఇక టీజర్ రిలీజయ్యాక బిజినెస్ డీల్ కూడా బాగానే అన్నారు.. ఇప్పుడు తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరూ ఓ లుక్కేయండి.

 చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, యస్‌జే చైతన్య దర్శకత్వంలో, జివియన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ‘ఏడు చేపల కథ’ నవంబర్ 7న రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది. సంగీతం : ఎమ్‌టి కవి శంకర్.