Asianet News TeluguAsianet News Telugu

మీ ఇల్లు షాక్ కొట్టకుండా ఉండాలంటే: ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రిక్ వర్క్స్ కీలకపాత్ర పోషిస్తాయి. మీ ఇంటిని ధగధగలాడించడంతో పాటు ప్రతి పనిలోనూ కీలక పాత్ర పోషించే ఈ వ్యవహారంలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జరిగే నష్టం మీ ఊహకు కూడా అందదు. 

How to wire your house shock proof
Author
Hyderabad, First Published Jan 9, 2020, 4:41 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రిక్ వర్క్స్ కీలకపాత్ర పోషిస్తాయి. మీ ఇంటిని ధగధగలాడించడంతో పాటు ప్రతి పనిలోనూ కీలక పాత్ర పోషించే ఈ వ్యవహారంలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జరిగే నష్టం మీ ఊహకు కూడా అందదు. విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం ఉపయోగించే పైపులు, వైర్ల నాణ్యత.. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి.

ఫిట్టింగ్ సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, నిపుణుడైన ఎలక్ట్రీషియన్ ఎంపిక ప్రమాదాలను నివారిస్తుంది. గృహ నిర్మాణ సమయంలో నిర్వహించే ఎలక్ట్రిక్ పనుల కోసం తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలు మీకోసం.

* మీ ఎలక్ట్రీషన్ ఇంట్లో ఉపయోగించే వివిధ ఎలక్ట్రిక్ పాయింట్ల మొత్తం లోడ్‌ను లెక్కించారో లేదో నిర్థారించుకోవాలి. అదే విధంగా వైరింగ్ కూడా ఇంట్లోని పలు ప్రదేశాల్లో ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ల నుంచి లోడ్ తీసుకుంటుందో లేదో చూసుకోవాలి. లోడ్‌ను ఏ మాత్రం తట్టుకోలేని, సరైన నాణ్యత లేని వైర్లను ఉపయోగించినట్లయితే ఇది ఇంట్లో అగ్నిప్రమాదాలకు దారి తీసి, ప్రాణాలకు అపాయం కలిగించే ప్రమాదం ఉంది. 

* అన్ని రకాల ఎలక్ట్రిక్ వర్క్స్, ఫిట్టింగులు ప్రస్తుత భారతీయ విద్యుత్ చట్టాలు, నియమాలకు లోబడి ఉండాలి. ఎలక్ట్రికల్ ఫిట్టింగులలో ఉపయోగించే అన్ని వస్తువుల ఐఎస్ఐ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తయారు చేశారో లేదో నిర్థారించుకోవాలి.

* ఆర్‌సీసీ స్లాబులు, గోడలకు పైపులు, జంక్షన్ బాక్సులను ఫిట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏదైనా లోపం తలెత్తితే అది ఏదైనా ప్రమాదానికి కారణం కావొచ్చు. అందువల్ల మళ్లీ ఆ భాగాన్ని రిప్లేస్ చేయాల్సి వుంటుంది. అయితే అది ఎంతో ఖర్చుతో కూడకున్న వ్యవహారం. 

ఇకపోతే ఇంటిని ఎలక్ట్రికల్ షాక్ ప్రూఫ్ చేసేందుకు వీలుగా వైరింగ్‌లో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

* ప్రధాన కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుల నుంచి వైర్ల ద్వారా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అన్ని కండక్టర్లు, గోడలు, పైకప్పుల గుండా విద్యుత్ ప్రవహిస్తూ ఉండాలి. ఇందువల్ల ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి సులభంగా చేరుకోవచ్చు. 

* ఎట్టి పరిస్ధితుల్లోనూ వైరింగ్‌ను సీలింగ్‌కు పైన ఏర్పాటు చేయకూడదు. త్రీ వైర్ సిస్టమ్‌కు ఎదురుగా లేదా త్రీ ఫేజ్ సిస్టమ్‌ యొక్క వివిధ దశలలోని సర్క్యూట్ అన్ని సందర్భాల్లోనూ సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. రెండు సర్క్యూట్ల మధ్య కనీసం 7 అడుగుల దూరం ఉండాలి. మీడియం ప్రెజర్ వైరింగ్‌ సహా అన్ని అనుబంధ ఉపకరణాలు ఐఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 

* లైట్ సర్క్యూట్లలోని పాయింట్ల సంఖ్య 10కి మించకూడదు లేదా సర్క్యూట్ మొత్తం లోడ్ 800 వాట్స్ మించకూడదు. ఒక సర్క్యూట్‌ నుంచి ఎలక్ట్రికల్ మీటర్ నుంచి మెయిన్ ఫ్యూజ్‌ నుంచి ఒక కనెక్షన్‌గా వివరించవచ్చు. పవర్ వైరింగ్ సర్క్యూట్ కోసం ఒక సర్క్యూట్‌లోని పాయింట్ల సంఖ్య 2 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే వైర్ రాగిది అయితే 1.5 మి.మీ, అల్యూమినియం అయితే 2 మి.మీ ఉండాలి.

* స్విచ్ బోర్డులను గోడకు 1.5 మీటర్ల ఎత్తులో అమర్చాలి. వైరింగ్ దానికి క్షితిజ సమాంతరంగా 3 మీటర్ల ఎత్తులో ఉండాలి. 

* ఎర్త్ వైర్ విషయానికి వస్తే అది రాగి తీగ అయితే 14 ఎస్‌డబ్ల్యూ‌జీ.. అల్యూమినియం అయితే 4 మీ.మీ ఉండాలి. ఫ్యూజ్ వైరును ఫేజ్‌ వైరుకు మాత్రమే కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ లింక్‌ను న్యూట్రల్ వైరుతో కనెక్ట్ చేయాలి. అన్ని స్విచ్ఛులను ఫేజ్ వైరుకు కనెక్ట్ చేయాలి. లైట్ సర్క్యూట్ కోసం ఎర్త్ వైర్ రాగిది అయితే 1 మి.మీ, అల్యూమినియం అయితే 1.5 మి.మీ ఉండాలి. 

* అన్ని కండక్టర్లను రాగితో రాగితో తయారు చేయాలి. ఇది 0.0020 చదరపు అంగుళాల కన్నా తక్కువ క్రాస్ సెక్షన్ కలిగి ఉండాలి. నామినల్ ఏరియా (3/0.029 అంగుళాలు) దీనితో పాటు ప్రతి కండక్టర్ విడిగా ఉండాలి.

Follow Us:
Download App:
  • android
  • ios