సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని ఉన్మాదిగా మారిన ఓ యువకుడు యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టపగలే ఆమెను అడ్డగించి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తిరుమలగిరి మండలం రాఘవాపురంలోచోటుచేసుకుంది. 

దీంతో యువతి ఒళ్లంతా మంటలు వ్యాపించి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు తీవ్రమైన కాలిన గాయాలతో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడున్న యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా  వున్నట్లు సమాచారం. 

read more  అమ్మాయిలను చెరపట్టి లైంగికదాడి: దొంగ బాబా ఉచ్చులో నిజాామాబాద్ యువతి

ఈ దారుణానికి పాల్పడిని ఉన్మాది వెంకటేశ్ గత రెండేళ్లుగా ప్రేమపేరుతో యువతి వెంట పడుతూ వేధిస్తున్నాడు. పలుమార్లు యువతి బంధువులు అతన్ని గట్టిగా హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదు. ఈ మధ్యకాలంలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. చివరకు ఉన్మాదిలా మారి యువతి ప్రాణాలను బలితీయడానికి వెనకాడలేదు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిని యువకుడు ప్రస్తుతం పరారీలో వుండగా అతడి కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం  ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.