Asianet News TeluguAsianet News Telugu

సఫారీ స్పిన్నర్‌ని వెనక నుంచి తన్నిన యజ్వేంద్ర చాహాల్... సోషల్ మీడియాలో ద్వారా వార్నింగ్...

డ్రింక్స్ బ్రేక్ సమయంలో తబ్రేజ్ షంసీని వెనక్కి నుంచి తన్నిన యజ్వేంద్ర చాహాల్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో... 

Yuzvendra Chahal hits Tabraiz Shamsi in India vs South Africa 2nd T20I, video goes viral
Author
First Published Oct 3, 2022, 5:27 PM IST

టీమిండియాలో మహా తుంటరి ప్లేయర్ ఎవరంటే అందరూ యజ్వేంద్ర చాహాల్ పేరే చెబుతారు. తన స్టైల్‌లో ఛలోక్తులు, జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు యజ్వేంద్ర చాహాల్. తాజాగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో యజ్వేంద్ర చాహాల్ చేసిన ఓ పని, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

అర్ష్‌దీప్ సింగ్ సెన్సేషనల్ స్పెల్ కారణంగా రెండు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. ఈ దశలో క్రీజులో ఉన్నా క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్‌లకు డ్రింక్ తీసుకొచ్చాడు సఫారీ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ...

ఇదే సమయంలో భారత ప్లేయర్లకు డ్రింక్ తీసుకొచ్చిన టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, షంసీని వెనక్కి నుంచి కాలితో తన్ని కింద పడేసే ప్రయత్నం చేశాడు. షంసీ వెనక్కి చూసి చాహాల్‌తో మాట్లాడాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు బయట మంచి స్నేహితులు. సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టీవ్‌గా ఉండే షంసీ కూడా చాహాల్ మాదిరిగానే చాలా సరదాగా ఉంటాడు...

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు తబ్రేజ్ షంసీ. ‘ఎంత ఫ్రెండ్స్ అయినా కెమెరాల ముందు ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు... యజ్వేంద్ర చాహాల్ నీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా...’ అంటూ పోస్టు చేశాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఎంపికైన యజ్వేంద్ర చాహాల్, కొన్నాళ్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక తుది జట్టులో చోటు కోల్పోయాడు. యజ్వేంద్ర చాహాల్ కంటే రవీంద్ర జడేజా స్థానంలో భారత జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుండడంతో సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లోనూ అతన్నే ఆడించింది మేనేజ్‌మెంట్...

అక్షర్ పటేల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటూ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. రెండో టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహార్ తర్వాత పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్‌గా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు కోల్పోయిన యజ్వేంద్ర చాహాల్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఎలాగైనా ఆడాలని అనుకుంటున్నాడు. అటు పొదుపుగా బౌలింగ్ చేయలేక, ఇటు వికెట్లు తీయలేక టీమ్‌లో చోటు కోల్పోయిన యజ్వేంద్ర చాహాల్, మూడో టీ20లో అయినా చోటు దక్కించుకుంటాడేమో చూడాలి...

మరోవైపు ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో కొనసాగుతున్న తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20లో 2.4 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు సమర్పించాడు. తొలి మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన తబ్రేజ్ షంసీకి రెండో టీ20లో అవకాశం ఇవ్వలేదు సౌతాఫ్రికా జట్టు.. ఇండోర్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో తబ్రేజ్ షంసీ, యజ్వేంద్ర చాహాల్ ఆడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios