WTC Final 2023: ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా  టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్  సింగ్ లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 


భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల లీడ్ లో ఉంది. కాగా మూడో రోజు ఆట ముగిశాక ఈ మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న స్టార్.. టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్ లతో మూడో రోజు ఆట, ఆస్ట్రేలియా టార్గెట్, భారత్ కు గెలుపు అవకఆవాల వంటి వాటి గురించి సీరియస్ గా చర్చిస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

భజ్జీ - దినేశ్ కార్తీక్ లు సీరియస్ గా చర్చించుకుంటుండగా.. వెనకాలే ఉన్న కొంతమంది అభిమానులుఈ ఇద్దరి సంభాషణను ఆసక్తిగా వింటున్నారు. ఇదే క్రమంలో వాళ్లంతా ఓ బెంచ్ ముందు బీర్ గ్లాస్ లు పెట్టుకుని కెమెరాలో కనిపించారు.

ఇది గమనించిన కెమెరామెన్.. హర్భజన్ కామెంట్రీని ఆసక్తిగా వింటున్న ఓ సర్దార్ ను పిలిచి అది తీసేయాలని కోరాడు. ముందు ఆ సర్దార్ కు కెమెరామెన్ ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. కానీ తర్వాత కెమెరామెన్ స్పష్టంగా బీర్ గ్లాస్ అని చెప్పడంతో తేరుకుని దానిని అక్కడ్నుంచి తీసి కెమెరాకు కనబడని చోటులో పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. 

Scroll to load tweet…

ఈ వీడియోకు నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘వాస్తవానికి కెమెరామెన్ బీర్ గ్లాస్ ను తీయమనలేదు. తనకు కూడా ఓ సిప్ ఇవ్వమన్నాడు. కానీ ఆ సర్దారేమో అది అర్థం కాక లోపల దాచుకున్నాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘ఏదేమైనా సర్దార్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే కేక.. ముఖ్యంగా లాస్ట్ లో ఆ థమ్సప్ అయితే సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…