ICC World Test Championship 2023: 66.67 శాతం విజయాలతో టాప్‌లో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో టీమిండియా... 2021 హిస్టరీ రిపీట్ అయితే టీమిండియాకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ అధికారికంగా ముగిసింది. శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు, 2023 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్. ఆస్ట్రేలియా 66.67 శాతం విజయాలతో టాప్‌లో ఉంటే, భారత జట్టు 58.80 విజయ శాతంతో ఫైనల్‌కి అర్హత సాధించింది..
టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా, రెండో స్థానంలో నిలిచిన టీమిండియా మధ్య జూన్ 7 నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2021 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...
దీంతో ఈసారి కూడా అదే రిపీట్ అయితే టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతగా నిలవడం ఖాయం. ఇప్పటికే వరుసగా రెండు సీజన్లలో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది..
సౌతాఫ్రికా 6 సిరీసుల్లో 8 విజయాలు, 6 పరాజయాలు అందుకుని ఓ మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. 55.56 విజయాల శాతంతో మూడో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా, ఒక్క టెస్టు మ్యాచ్ గెలిచి ఉంటే ఫైనల్‌కి చేరి ఉండేది...
జో రూట్ కెప్టెన్సీలో 2 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక చాలా మెరుగైంది. ఓవరాల్‌గా 6 సిరీసుల్లో 10 విజయాలు అందుకున్న ఇంగ్లాండ్, 8 పరాజయాలు చవిచూసింది. 4 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఓవరాల్‌గా ఇంగ్లాండ్ 124 పాయింట్లు సాధించినా ఎక్కువ మ్యాచులు ఆడడం వల్లే ఇంగ్లాండ్ విజయాల శాతం 46.97గా ఉంది...
ఫైనల్ బెర్త్ కోసం ఆఖరి వరకూ పోటీలో నిలిచిన జట్టు శ్రీలంక. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ని 2-0 తేడాతో ఓడిన శ్రీలంక, 44.44 విజయాల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. ఇదే టెస్టు సిరీస్‌ని శ్రీలంక 2-0 తేడాతో గెలిచి ఉంటే, ఆస్ట్రేలియాతో కలిసి ఫైనల్ ఆడేది..
డిఫెండింగ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఛాంపియన్ న్యూజిలాండ్, ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 2021-23 సీజన్‌లో 4 విజయాలు అందుకున్న న్యూజిలాండ్, 6 పరాజయాలు అందుకుంది. 3 మ్యాచులు డ్రాగా ముగిశాయి..
పాకిస్తాన్ ఫైనల్ చేరితే, ఇండియా - పాక్ మధ్య కొన్నేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ చూడవచ్చని ఆశపడ్డారు అభిమానులు. అయితే ఆరంభంలో బాగానే ఆడిన పాక్, 2021-23 సీజన్‌లో స్వదేశంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. మొత్తంగా 4 మ్యాచుల్లో గెలిచి, 6 మ్యాచుల్లో ఓడింది. 4 టెస్టులు డ్రా చేసుకున్న పాక్, 38.1 విజయాల శాతంతో ఏడో స్థానంలో నిలిచింది...
వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచి ఫైనల్ పోటీలో లేదు. ఈ సీజన్‌లో 4 విజయాలు అందుకున్న వెస్టిండీస్, 7 టెస్టు మ్యాచులు ఓడింది. 2 టెస్టులను డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా వెస్టిండీస్ 34.62 శాతం సక్సెస్ రేటుతో 8వ స్థానంలో నిలిచింది...
పసికూన బంగ్లాదేశ్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఒకే ఒక్క టెస్టును డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా 12 మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్, ఓ మ్యాచ్ గెలిచి 10 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌కి ఆఖరి పొజిషన్‌లో ముగించిన బంగ్లాదేశ్ సక్సెస్ రేటు 11.11 మాత్రమే..
