ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ఆసిస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ బయటపెట్టాడు. షేన్ వార్న్ కి స్టేడియంలోకి అడుగుపెట్టడానికి ముందు ఓ అలవాటు ఉందంటూ మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు. సిగరేట్ తాగిన తర్వాతే ఆయన స్టేడియంలోకి అడుగుపెట్టేవాడట. ఈ విషయాన్ని క్లార్క్ తాజాగా బయటపెట్టాడు.

షేన్ వార్న్ ఆన్ ఫీల్డ్ లో ఏవిధంగా రెచ్చిపోయేవాడో... ఆఫ్ ద ఫీల్డ్ కూడా అదేవిధంగా రెచ్చిపోయి ప్రవర్తించేవాడని క్లార్క్ పేర్కొన్నాడు. దీంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరేట్ కాల్చేవాడని.. తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో నే అతను అలాచేసేవాడని వివరించాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడని కొనియాడాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేదని... దానికి అతను గ్రౌండ్లోనే బదులిచ్చేవాడని చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా.. దాని తాలుకా ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదని  వార్న్ కి మద్దతుగా నిలిచాడు.