Asianet News TeluguAsianet News Telugu

కండలు చూపిస్తూ ఫిట్‌నెస్ వీడియో షేర్ చేసిన విరాట్ కోహ్లీ... మాంసం తింటేనే కండలు వస్తాయంటే...

షర్ట్ విప్పి వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన విరాట్ కోహ్లీ... ‘టైగర్’ అంటూ కామెంట్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. అభిమాని కామెంట్‌కి విరాట్ రిప్లై వైరల్.. 

Virat Kohli shares his workouts video and replies to fan, biggest myth in the world
Author
First Published Nov 24, 2022, 3:35 PM IST

వరల్డ్ మోస్ట్ ఫిటెస్ట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ, భారత జట్టు ప్లేయర్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పూర్తిగా మార్చేశాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా ప్లేయర్లు గాయాలతో జట్టుకి వరుసగా దూరమవుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం పర్ఫెక్ట్‌ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాడు..

14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగంటే నాలుగే. పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడమే కాకుండా తన వర్కవుట్ వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ...

తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి ముందు వర్కవుట్స్ మొదలెట్టేశాడు విరాట్ కోహ్లీ... ట్రేడ్ మిల్‌ మీద పరుగెత్తుతున్న వర్కవుట్స్‌తో పాటు షర్ట్ లేకుండా తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించాడు టీమిండియా మాజీ కెప్టెన్. ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చేశాయి...

టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్... ‘టైగర్’ సింబల్‌ని కామెంట్ చేయగా ఆర్‌సీబీ యాంకర్ డానిష్ సైట్ ‘ప్రపంచంలో యూత్ సాక్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, కింగ్ వాటిని తొడ కండరాల దాకా వేసుకుంటున్నాడు. అందుకే కింగ్ చాలా ప్రత్యేకం. బిలయన్లలో ఒక్కడు... లవ్ యూ’ అంటూ కామెంట్ చేశాడు...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇమ్రాన్ సర్ఫరాజ్ అనే వ్యక్తి, విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన వీడియోపై ‘అందరూ మాంసం తినకపోతే బాడీ పెంచలేం అంటారు...’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై రిప్లై ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు విరాట్ కోహ్లీ. ‘హాహాహా... అది ప్రపంచంలో అతి పెద్ద భ్రమ... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

కండలు తిరిగిన శరీర సౌష్టవం కావాలంటే మాంసం బాగా తినాలని చాలా మంది అనుకుంటారు. అయితే పూర్తి వెజిటేరియన్ అయిన విరాట్ కోహ్లీ, గుడ్లు మాత్రమే తీసుకుంటాడు. ఒకనాక సమయంలో విరాట్ కోహ్లీ వేగన్ అని... పాలు, పాల పదార్థాలు కూడా తీసుకోడని ప్రచారం జరిగింది. అయితే తన డైట్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో ‘ఛిల్ బాయ్స్... నేను వేగన్ అని ఎప్పుడూ చెప్పలేదు. జస్ట్ వెజిటేరియన్‌ని మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ..


టీ20 వరల్డ్ కప్ 2022లో నాలుగు హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. పొట్టి ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొనని విరాట్ కోహ్లీ... వన్డే సిరీస్‌లో కూడా ఆడడం లేదు. 

కివీస్ టూర్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... బంగ్లాదేశ్ టూర్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించే టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios