Virat Kohli: ఏకైక భారత క్రికెటర్.. రికార్డుల రారాజు ఖాతాలో మరో అరుదైన రికార్డు..
Virat Kohli: టెస్టు నుంచి వన్డే, టీ20 నుంచి ఐపీఎల్ వరకు ప్రతి టోర్నీలోనూ విరాట్ ఆధిపత్యం ఉండాల్సిందే.. అలాగే.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకీ ఆ ఘనత ఏంటీ?
Virat Kohli: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్-17లో భాగంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన లక్నో, బెంగళూరు మ్యాచ్ లో విరాట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంగా విరాట్ కోహ్లీకి ఇది 100వ టీ20 మ్యాచ్. దీంతో ఒకే స్టేడియంలో 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి అదురైన రికార్డు క్రియేట్ చేశారు.
ఈ 100 మ్యాచ్‌ల్లో భారత్ తరపున 15 మ్యాచ్‌లు ఆడగా.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుఫున 85 మ్యాచ్‌ల్లో ఆడారు. మొత్తం 100 మ్యాచ్‌ల్లో 39.73 సగటుతో 3,298 పరుగులు చేశాడు. అందులో 4 శతకాలు, 25 అర్థ శతకాలను నమోదు చేశారు. విరాట్ తర్వాత రోహిత్ శర్మ 80 మ్యాచులు.. ముంబాయిలోని వాంఖడే స్టేడియం ఆడగా.. టీమిండియా మాజీ కెప్టెన్న ఎం.ఎస్ ధోనీ.. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో 69 మ్యాచ్‌లు ఆడి.. తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. దాదాపు 10 నెలల విరామం తర్వాత కూడా అతను 4008 పరుగులతో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఇదే ఘనతను సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లో ఛేదించారు.
అలాగే..ఏదైనా ఒక జట్టుపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై 10 సెంచరీలు చేసిన ఘనత విరాట్ సొంతం. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 15 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. వన్డేల్లో ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 26 సెంచరీలు సాధించాడు.
ఇది కూడా ప్రపంచ రికార్డు. ఈ రికార్డులోనూ 17 సెంచరీలతో విరాట్ మొదటి స్థానంలో, సచిన్ రెండో స్థానంలో ఉన్నారు. అలాగే.. టెస్టుల్లో కెప్టెన్‌గా 4,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ ఘనతను కూడా కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశారు.