Asianet News TeluguAsianet News Telugu

నా ముద్దుపేర్లలో అత్యంత ఇష్టమైన పేరు అదే: ధోని

తాము ఇష్టపడే నటులకు, క్రీడాకారులకు అభిమానులు అసలు పేరుతో కాకుండా ముద్దుపేరుతో పిలుచుకోవడం చేస్తుంటారు. ఈ సాంప్రదాయం సినిమాల్లో ఏ స్థాయిలో వుందో అదే స్థాయిలో క్రికెట్లో కూడా వుంది. ఇక ఐపిఎల్ వచ్చాక అది మరింత ఎక్కువయ్యింది. తమ రాష్ట్రానికి ప్రాతినిద్యం వహిస్తున్న క్రికెటర్లను అభిమానులు స్థానిక బాషల్లోనే కీర్తిస్తూ ముద్దుగా పిలుచుకోవడం చేస్తున్నారు. అలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనిని కూడా తమిళ అభిమానులు ఓ ముద్దు పేరు పెట్టుకున్నారు. ఇలా తమిళ ప్రజలు ఎంతో అభిమానంతో పెట్టుకున్న ఆ పేరుతో పిలిస్తే తనకు కూడా ఎంతో సంతోషంగా వుంటుందని ధోని తాజాగా వెల్లడించాడు. దీంతో ఆ ముద్దుపేరు వార్తల్లో నిలిచింది. 

Thala is my favourite nickname; dhoni
Author
Chennai, First Published May 2, 2019, 4:55 PM IST

తాము ఇష్టపడే నటులకు, క్రీడాకారులకు అభిమానులు అసలు పేరుతో కాకుండా ముద్దుపేరుతో పిలుచుకోవడం చేస్తుంటారు. ఈ సాంప్రదాయం సినిమాల్లో ఏ స్థాయిలో వుందో అదే స్థాయిలో క్రికెట్లో కూడా వుంది. ఇక ఐపిఎల్ వచ్చాక అది మరింత ఎక్కువయ్యింది. తమ రాష్ట్రానికి ప్రాతినిద్యం వహిస్తున్న క్రికెటర్లను అభిమానులు స్థానిక బాషల్లోనే కీర్తిస్తూ ముద్దుగా పిలుచుకోవడం చేస్తున్నారు. అలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనిని కూడా తమిళ అభిమానులు ఓ ముద్దు పేరు పెట్టుకున్నారు. ఇలా తమిళ ప్రజలు ఎంతో అభిమానంతో పెట్టుకున్న ఆ పేరుతో పిలిస్తే తనకు కూడా ఎంతో సంతోషంగా వుంటుందని ధోని తాజాగా వెల్లడించాడు. దీంతో ఆ ముద్దుపేరు వార్తల్లో నిలిచింది. 

భారత క్రికెట్ జట్టు అభిమానులు ధోనిని చాలా  ముద్దుపేర్లతో పిలుచుకుంటారు. కెప్టెన్ కూల్, ఎంఎస్‌డి, మహీ, జార్ఖండ్ డైనమైట్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. అయితే ఐపిఎల్ లో చెన్నై జట్టు తరపున ఆడుతున్న ధోని అంటే తమిళ అభిమానులు ఎక్కడలేని అభిమానాన్ని పెంచుకున్నారు. స్వతహాగా తమ రాష్ట్రానికి చెందిన వారిని తప్ప ఇతరులను అంతగా ఇష్టపడని తమిళ తంబీలు ధోని విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అతడంటే పడిచచ్చే వారు ధోనిని తమ నాయకుడిగా పేర్కొంటూ ''తాల'' అనే ముద్దు పేరుతో పెట్టుకున్నారు. చెన్నైలో మ్యాచ్ వుందంటే చాలు మైదానం మొత్తం ఈ తాల పేరు మారుమోగుతుంది. ఇలా ఐపిఎల్ జరిగే రెండు నెలల పాటు ఈ పేరు తమిళనాడు మొత్తం వినిపిస్తుంటుంది. 

ఈ ముద్దుపేరుపై ధోని తాజాగా స్పందించాడు. తమిళ ప్రజలు తనను పేరుపెట్టి పిలవడం కంటే తలా( లీడర్) అంటూ పిలవడాన్నే ఇష్టపడతానని తెలిపాడు. తాను ఎక్కడికి వెళ్లినా తలా అన్న పేరే వినిపిస్తుందని... అంతలా ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు జట్టు మొత్తానికి చెన్నై అభిమానులు  అండగా నిలుస్తున్నారని ధోని వెల్లడించాడు. ఈ సీజన్ లో చెపాక్ స్టేడియంలో జరుగిన చివరి లీగ్ మ్యాచ్ అనంతరం ధోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. 

బుధవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య చెన్నై జట్టుదే డిల్లీపై పైచేయిగా నిలిచింది. 180 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఐపిఎల్ లో రెండోసారి సీఎస్కే చేతిలో ఘోరంగా ఓడిపోయిన డిల్లీ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికే పరిమితమయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios