ఐపిఎల్ సక్సెస్ ఫుల్ జట్టేదంటే చెన్నై సూపర్ కింగ్స్ పేరే ముందుగా వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీఫర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సిగ్ ధోని. మైదానంలో అతడి మాయాజాలంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో అద్భుత విజయాలను అందుకుని పలుమార్లు ఐపిఎల్ ట్రోపీని ముద్దాడగలిగింది. ఇలా తనతో పాటే జట్టుకు కూాడా మంచిపేరుతెచ్చిపెట్టాడు ధోని.

ఇక ఈ ఐపిఎల్ సీజన్ 12 లో కూడా చెన్నై జట్టు ఇంత సక్సెస్ ఫుల్ యాత్ర కొనసాగిస్తుందంటే అది ధోనీ చలవే అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో అతడు ఒంటిచేత్తో జట్టును గెలిపించినంత పనిచేసి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓటమిపాలైనా ధోని మాత్రం గెలిచాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కోహ్లీ సైతం ధోనిని చూసి భయపడ్డాలని చెప్పడమే అతడి విద్వంసకర ఆటతీరు ఎలా సాగిందో చెబుతుంది. ఈ మ్యాచ్ లో కేవలం 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించిన ధోని ఆటతీరుకు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఫిదా అయ్యాడట. దీంతో అతడు అతడు మీడియా సమక్షంలోనే ధోనిని ఆకాశానికెత్తేశాడు.
ధోని ఆటతీరు గురించి ఎంత మాట్లాడినా తక్కువగానే వుంటుందని కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో నెంబర్ వన్ ఆటగాడు ఎవరన్న దానిపై జరుగుతున్న చర్చను గుర్తుచేసిన ఆయన...తప్పకుండా ధోనీనే నెంబర్ వన్ ఆటగాడని కితాబిచ్చాడు. ఈ మాట తాను కాదు క్రికెట్ అభిమానులే చెబుతున్నారని వెల్లడించారు.
అ దేశానికి ఎక్కువ సేవ చేస్తున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనియేనని ప్రశంసించారు. సుదీర్ఘకాలంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం క్రికెట్ ఆడటం అతడికొక్కడికే చెల్లిందన్నారు. ఇది అంత సులభమై విషయం కాదన్నారు. ఇలా దేశం కోసం తన వ్యక్తిగత ఇష్టాలను కూడా దూరం పెట్టడం వల్లే ధోనికి ఇది సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. ధోని ఈ ప్రపంచ కప్ టోర్నీలో కీలకం కానున్నాడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 23, 2019, 7:46 PM IST