Asianet News TeluguAsianet News Telugu

సరికొత్త హెయిర్ స్టైల్లో ధోని... ఆర్టిస్ట్ ‌గా మారనున్నట్లు ప్రకటన (వీడియో)

ఎంఎస్ ధోని... అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపిఎల్ అయినా అతడి స్టైలే వేరు. కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీఫర్ ఇలా ఏ పని చేసినా అందులో నెంబర్ వన్ గా వుండటాన్ని అలవాటుగా మార్చుకున్న అరుదైన క్రికెటర్. అందువల్లే అతడంటే అభిమానులు పడిచస్తుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలొ  ధోని డిపరెంట్ ఎయిర్ స్టైల్ తో కనిపించేవాడు. ఆయన్ను చూసి చాలా మంది అభిమానులు కూడా దాన్ని ఫాలోఅయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఆ హెయిర్ స్టైల్ ను మార్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందన్న సమయంలో  ధోని కొత్త హెయిర్ స్టైలో తో దర్శనమిచ్చి అభిమమానులను సర్ప్రైజ్ చేశాడు. 

team india player ms dhoni new hair style
Author
Mumbai, First Published May 20, 2019, 10:57 PM IST

ఎంఎస్ ధోని... అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపిఎల్ అయినా అతడి స్టైలే వేరు. కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీఫర్ ఇలా ఏ పని చేసినా అందులో నెంబర్ వన్ గా వుండటాన్ని అలవాటుగా మార్చుకున్న అరుదైన క్రికెటర్. అందువల్లే అతడంటే అభిమానులు అంతలా పడిచస్తుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలొ  ధోని డిపరెంట్ ఎయిర్ స్టైల్ తో కనిపించేవాడు. ఆయన్ను చూసి చాలా మంది అభిమానులు కూడా దాన్ని ఫాలోఅయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని ఆ హెయిర్ స్టైల్ ను మార్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందన్న సమయంలో  ధోని కొత్త హెయిర్ స్టైలో తో దర్శనమిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. 

తాజాగా ధోని అభిమానుల కోసం ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో రైటర్మెంట్ తర్వాత తనకిష్టమైన కొన్ని పనులను కొనసాగిస్తానని పేర్కొన్నాడు. అందులో ముఖ్యమైనది పెయింటింగ్ హాబీని కొనసాగించడం. చిన్నప్పటి నుండి తనకు పెద్ద ఆర్టిస్ట్ కావాలన్న కోరిక వుండేదని...కానీ క్రికెట్ కోసం ఆ ఆశలను చంపుకున్నానన్నారు. ఇలా అప్పటినుండి  ఇప్పటివరకు చాలా క్రికెట్ ఆడాను. క్రికెటర్ గా తన కెరీర్ ముగిసిన తర్వాత ఆర్టిస్ట్ గా మారతాను. కావాలంటే నేను వేసిన  ఈ పెయింటింగ్స్ చూసి నేను ఆర్టిస్ట్ ను అవునో కాదో చెప్పండి అని పేర్కొంటూ ధోని కొన్ని పెయింటింగ్స్ ఈ వీడియోలో అభిమానులకు చూపించారు.   

అయితో ధోని పెయింటింగ్స్ ఎంతమందికి నచ్చిందో లేదో తెలీదు కానీ అతడి కొత్త హెయిర్ స్టైల్ అభిమానులకు తెగ నచ్చింది.  దీంతో అతడి పెయింటింగ్స్ కంటే ఎక్కువగా ఆ హెయిర్ స్టైల్ పై చర్చ జరుగుతోంది.  ఈ వీడియో చూసిన నెటిజన్లు ధోనీ హెయిర్ స్టైల్ కు ఫిదా అయి  దానికి సంబంధించిన కామెంట్సే చేస్తున్నారు.     ఇంకా టీవిల్లో కనిపించముందే దానిపై ఇంతలా చర్చ జరుగుతుంటే ఇక ఒక్కసారి ధోని కొత్త హెయిర్ స్టైల్లో మైదానంలో కనిపిస్తే దాన్ని ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి మరి.

 

Follow Us:
Download App:
  • android
  • ios