TATA IPL 2022: వారం రోజుల పాటు సాగుతున్న ఐపీఎల్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం.. ఛేదనలో మంచును ఉపయోగించుకుంటూ లక్ష్యాన్ని సాధించడం చూస్తూనే ఉన్నాం. అయితే నేడు మాత్రం కాస్త డిఫరెంట్.
టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే.. ఐపీఎల్ లో ఇప్పటిదాకా ఇదే సూత్రం ఫాలో అవుతున్నాయి ఫ్రాంచైజీలు. టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. తొలుత రాజస్థాన్-ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన సంజూ శాంసన్ సేన ఆటలో నెగ్గింది. ఇక ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. టాస్ గెలిచి గుజరాత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ.. బ్యాటర్లు తేలిపోవడంతో ఓటమి కొనితెచ్చుకుంది. గుజరాత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యానికి గాను.. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆ జట్టు... 14 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇది ఢిల్లీకి తొలి ఓటమి కాగా గుజరాత్ కు వరుసగా రెండో గెలుపు.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. టీమ్ సీఫర్ట్ (3) ను హార్థిక్ పాండ్యా ఔట్ చేశాడు. నాలుగో ఓవర్లో పృథ్వీ షా (10) తో పాటు మన్దీప్ సింగ్ (18) ను ఔట్ అయ్యారు. ఈ ఇద్దరినీ లాకీ ఫెర్గూసన్ పెవిలియన్ కు పంపడం విశేషం.
5 ఓవర్లలో 34 పరగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇన్నింగ్స్ ను రిషభ్ పంత్ (29 బంతుల్లో 43.. 7 ఫోర్లు), లలిత్ యాదవ్ (22 బంతుల్లో 25.. 2 ఫోర్లు, 1 సిక్సర్) లు భుజానకెత్తుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 61 పరగులు జోడించారు. అయితే విజయ్ శంకర్ ఓవర్లో పరుగు తీసే క్రమంలో లలిత్ యాదవ్ ను అభినవ్ మనోహర్ రనౌట్ చేశాడు. అప్పటికీ ఢిల్లీ స్కోరు 11.4 ఓవర్లకు 95 పరుగులే.
ఆ తర్వాత కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న రిషభ్ పంత్ కూడా ఫెర్గూసన్ బౌలింగ్ లో అనవసరమైన షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచులో అదే టర్నింగ్ పాయింట్. పంత్ నిష్క్రమించాక అక్షర్ పటేల్ (8), శార్దూల్ ఠాకూర్ (2) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. పావెల్ (12 బంతుల్ల 20.. 2 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త దూకుడుగా ఆడినా అతడికి సహకారం అందించేవాళ్లు లేకపోవడంతో చివరికి అతడు కూడా షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఖలీల్ అహ్మద్ (0) కూడా తొలి బంతికే డకౌటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. హార్థిక్ పాండ్యా, రషీద్ ఖాన్ లు తలో వికెట్ దక్కించుకున్నారు. షమీకి రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. గుజారత్ కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. ముస్తాఫిజుర్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (1) ను ఔట్ చేశాడు. ముస్తాఫిజుర్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (1) ను ఔట్ చేశాడు. కానీ తర్వాత హార్థిక్ పాండ్యా (31) తో కలిసి గిల్.. గుజరాత్ కు భారీ స్కోరు అందించాడు. పాండ్యాతో కలిసి గ్రౌండ్ నలువైపులా చూడచక్కని షాట్లు ఆడాడు.
కుల్దీప్ యాదవ్ వేసిన 13 వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు గిల్. ఇది అతడికి 11వ ఐపీఎల్ అర్థ శతకం. అయితే తర్వాత ఓవర్లో పాండ్యా ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. అయితే గిల్ నిష్క్రమించాక చివరి 2 ఓవర్లలో ఆ జట్టు పరుగులు రాబట్టడంలో విఫలమైంది.
