Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: ‘వరల్డ్ ఛాంపియన్స్’తో అలరిస్తున్న డీజే బ్రావో.. విండీస్ ఆటగాళ్ల రచ్చ మాములుగా లేదుగా..

DJ Bravo World Champions: డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న  డ్వేన్ బ్రావో... టీ20 ప్రపంచకప్ కోసం కొత్త పాటను రూపొందించాడు. 

T20 World Cup: west indies all rounder dj bravo releses his new song world champions
Author
Hyderabad, First Published Oct 22, 2021, 4:56 PM IST

టీ20 ప్రపంచకప్ (T20 World cup)లో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న వెస్టిండీస్ (West Indies) ఈసారి కూడా అదిరిపోయే ప్రదర్శన చేసి మూడో సారి పొట్టి కప్పును గెలుచుకోవాలని చూస్తున్నది. జట్టు నిండా ఆల్ రౌండర్లతో కళకళలాడుతున్న విండీస్.. కొన్ని లోపాలున్నా సూపర్ -12 నాటికి అవన్నీ తీరిపోతాయని ఆశాభావంతో ఉన్నది. అయితే ఆ జట్టును ఉత్సాహపరిచేందుకు విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne bravo) ఒక పాటను రూపొందించాడు. 

‘వరల్డ్ ఛాంపియన్స్’ (World champions) పేరిట బ్రావో (DJ Bravo).. ఈ పాటను రూపొందించాడు. ఇందులో అతడితో పాటు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle), పొలార్డ్ (kieron pollard), సునీల్ నరైన్ (sunil narine) తో పాటు ఆ జట్టుకు చెందిన పలువురు  ఆటగాళ్లు వీడియోలో మెరిశారు.  బ్రావోతో కలిసి వారంతా కాలు కదిపారు. 

గురువారం డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడయోను పోస్ట్ చేశాడు. ‘మరూన్ ఫ్యాన్స్!! వరల్డ్  ఛాంపియన్ ప్రీమియర్ కోసం సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో యూట్యూబ్ లో ఉంది’ అని పోస్టు చేశాడు. 

 

2016 ప్రపంచకప్ సందర్భంగా కూడా బ్రావో ‘ఛాంపియన్స్’ (Champions) అనే పాటను  రూపొందించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ కూడా అందర్నీ అలరిస్తుందని   బ్రావో అన్నాడు. 

 

గత టీ20 ప్రపంచకప్  ఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి రెండో సారి కప్ పట్టిన వెస్టిండీస్.. ఈసారి కూడా అదే ప్రదర్శన చేయాలని భావిస్తున్నది.  విండీస్ జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో ఆడినవాళ్లే కావడంతో యూఏఈలో పరిస్థితులపై వారికి మంచి అవగాహన ఉంది. అంతేగాక ఈసారి కూడా విండీస్ పూర్తి ఫామ్ లో ఉంది. 

కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ఆ జట్టు.. క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, బ్రావో, హిట్మేయర్ వంటి ఆటగాళ్లతో కళకళలాడుతున్నది. టీ 20 ప్రపంచకప్ లో భాగంగా.. శనివారం నాడు ఆ జట్టు ఇంగ్లండ్ తో తలపడబోతున్నది. రెండు వార్మప్ మ్యాచ్ లలో ఓడిపోవడం ఆ జట్టును కలవరపరుస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios