Asianet News TeluguAsianet News Telugu

ఆ రెండు మ్యాచుల్లో చెన్నై ఓడిపోడానికి కారణమదే... కెప్టెన్ ధోని దూరమవడం కాదు: రైనా

ఐపిఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని ఎంత కీలక ఆటగాడో కేవలం రెండు మ్యాచులు బయటపెట్టాయి. వెన్ను నొప్పి కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ కు, జ్వరం కారణంగా ముంబై తో జరిగిన మ్యాచుల్లో ధోని జట్టుకు దూరమయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ సీఎస్కే ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మళ్లీ  అతడు జట్టులోకి రాగానే మళ్లీ విజయయాత్ర కొనసాగించింది. దీంతో  ధోని జట్టుకు దూరమైతే  సీఎస్కే ఓడిపోతుందన్న అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. అయితే ఈ అభిప్రాయం నిజం కాదంటూ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

suresh raina comments about dhoni captaincy
Author
Hyderabad, First Published May 2, 2019, 6:18 PM IST

ఐపిఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని ఎంత కీలక ఆటగాడో కేవలం రెండు మ్యాచులు బయటపెట్టాయి. వెన్ను నొప్పి కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ కు, జ్వరం కారణంగా ముంబై తో జరిగిన మ్యాచుల్లో ధోని జట్టుకు దూరమయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ సీఎస్కే ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మళ్లీ  అతడు జట్టులోకి రాగానే మళ్లీ విజయయాత్ర కొనసాగించింది. దీంతో  ధోని జట్టుకు దూరమైతే  సీఎస్కే ఓడిపోతుందన్న అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. అయితే ఈ అభిప్రాయం నిజం కాదంటూ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ గా వ్యవహరించిన రైనా తాజాగా ఆ ఓటములకు గల కారణాలను వెల్లడించాడు. కెప్టెన్ ధోని జట్టుకు దూరమవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నాడు. ఇలా తన కెప్టెన్సిలో ఎలాంటి తప్పు లేదని రైనా అభిప్రాయపడ్డాడు. అయితే ధోని బ్యాటింగ్ ను మిస్సవడం మాత్రం జట్టుకు చాలా నష్టాన్ని చేసిందన్నాడు. అతడు క్రీజులోకి వస్తే చాలు  ప్రత్యర్థి ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఇలా ధోని బ్యాటింగ్ కు దిగకపోవడం వల్లే ఆ రెండు మ్యాచుల్లో ఓటమిపాలయ్యామని రైనా తెలిపాడు. 

ఇంకా ధోని కెప్టెన్సీ గురించి రైనా మాట్లాడుతూ... గతకొన్నేళ్లుగా చెన్నై మెంటర్, బ్యాట్ మెన్ గా  అతడు అద్భుతాలు చేశాడని ప్రశంసించాడు. అలాగే చెన్నై కెప్టెన్ గా అతడు ఎన్ని రోజులు అయినా కొనసాగవచ్చని తెలిపాడు. చెన్నై జట్టుతో పాటు ధోని సామర్థ్యం గురించి మనకు తెలుసని రైనా పేర్కొన్నారు. 

ఇలా ధోని కెప్టెన్సీపై మాట్లాడుతూనే చెన్నై జట్టు పగ్గాలను స్వీకరించడానికి సిద్దంగా వున్నానంటూ రైనా పరోక్షంగా లీక్ ఇచ్చారు. తన కెప్టెన్సీలో ఎలాంటి లోపాలు లేవంటూనే ధోని ఎంతకాలమైనా చెన్నై కెప్టెన్ గా వుండవచ్చన్నాడు. అయితే అతడి కెప్టెన్ గా జట్టుకు దూరమైనా ఎలాంటి ప్రభావం వుండదని రైనా అభిప్రాయపడ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios