Asianet News TeluguAsianet News Telugu

మరో స్టార్ బౌలర్‌ని పట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్... ఆ లీగ్‌లో సన్‌రైజర్స్‌‌కి మ్యాచ్ విన్నర్‌గా మారిన...

గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన న్యూజిలాండ్ స్టార్ బౌల్ కేల్ జెమ్మిసన్... సౌతాఫ్రికా యంగ్ పేసర్ సిసండ మగలని రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్న సీఎస్‌కే... 

Sunrisers Star in SA20 league Sisanda Magala replaces Kyle Jamieson in CSK for IPL 2023 cra
Author
First Published Mar 20, 2023, 5:00 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కి గుడ్ న్యూస్. గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మిసన్ ప్లేస్‌లో సౌతాఫ్రికా యంగ్ బౌలర్‌ సిసండ మగలని రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది సీఎస్‌కే...  

ఐపీఎల్ 2023 మినీ వేలంలో న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మిసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2021 వేలంలో కేల్ జెమ్మిసన్‌ని రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరంగా ఉన్న కేల్ జెమ్మిసన్, 2023 సీజన్‌ మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే వేలంలో కేల్ జెమ్మిసన్‌ని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. దీంతో బేస్ ప్రైజ్‌కే జెమ్మిసన్‌ని సొంతం చేసుకుంది సీఎస్‌కే...

అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు కేల్ జెమ్మిసన్. జెమ్మిసన్ ప్లేస్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చిన సిసండ మగల, సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ విన్నర్ సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ తరుపున ఆడాడు..

సౌతాఫ్రికా20 లీగ్‌లో 12 మ్యాచులు ఆడిన సిసండ మగల, 11 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరుపున 4 టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన సిసండ మగల, దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీల్లో మంచి బౌలింగ్ పర్ఫామెన్స్ కనబరుస్తూ అదరగొడుతున్నాడు...

ఐపీఎల్ 2023 సీజన్ కోసం బేస్ ప్రైజ్ రూ.50 లక్షలతో రిజిస్టర్ చేయించుకున్నాడు సిసండ మగల. అయితే ఆ సమయంలో ఏ ఫ్రాంఛైజీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. జెమ్మిసన్ ప్లేస్‌లో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు సిసండ మగల...

దీపక్ చాహార్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, ఐపీఎల్ 2023 సీజన్‌కి సిద్ధమవుతున్నాడు. అలాగే రవీంద్ర జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చర్చ నడుస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి, మాహీ భాయ్‌కి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అనుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో (కింది నుంచి రెండో స్థానం) నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది.  ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ కింది కింది రెండో స్థానంలో, 9వ స్థానంలో నిలిచి దారుణ పరాభవాన్ని చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌దే టైటిల్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్...
 

గత సీజన్‌లో 10 మ్యాచుల్లో నాలుగే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి కూడా సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. అజింకా రహానే‌ని జట్టులోకి తీసుకున్న సీఎస్‌కే, భారీ ధర చెల్లించి బెన్ స్టోక్స్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది. ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ని నడిపించే సారథిగా బెన్‌ స్టోక్స్‌ని చూస్తోంది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. కేల్ జెమ్మిసన్‌తో పాటు భగత్ వర్మ, అజయ్ మండల్, నిశాంత్ సింధు, షేక్ రషీద్‌లను వేలంలో కొనుగోలు చేసింది చెన్నై...

Follow Us:
Download App:
  • android
  • ios