WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో  ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత జట్టు సారథి రోహిత్ శర్మతో  ప్రముఖ అంపైర్ కుమార ధర్మసేన సెల్ఫీ దిగాడు. 

భారత అభిమానులకు మరోసారి నిరాశకు గురి చేస్తూ రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓడింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు సారథి రోహత్ శర్మతో ప్రముఖ శ్రీలంక అంపైర్, ఈ మ్యాచ్ కు రిజర్వ్ అంపైర్ గా ఉన్న కుమార ధర్మసేన సెల్ఫీ దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఫోటో నార్మల్ గానే ఉన్నా.. ధర్మసేనకు మాత్రం ఐసీసీ ట్రోఫీ ఫైనల్ లో ఓడిన టీమ్ కెప్టెన్ తో ఫోటో దిగడం అదోరకమైన తుర్తి (తృప్తి).. 

ఐసీసీ ప్రధాన టోర్నీలలో ఎక్కువగా కనిపించే ధర్మసేన.. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత రోహిత్ తో సెల్ఫీ తీసుకుంటూ పళ్లు ఇకిలిస్తూ ఫోజులిచ్చాడు. గతంలో ధర్మసేన.. 2019 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పుడు ఆ జట్టు ఓటమి బాధలో ఉంటే ఆయన మాత్రం తాపీగా సెల్ఫీ తీసుకున్నాడు. 

2022 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. అప్పుడు కూడా బాబర్ ఆజమ్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన సారథే కావడం గమనార్హం. 2019 వన్డే వరల్డ్ కప్ లో అయినా కాస్త నవ్వీ నవ్వనట్టు నవ్విన ధర్మసేన.. బాబర్ తో మాత్రం కోల్గేట్ యాడ్ లో యాక్టర్ లా స్మైల్ ఇచ్చాడు. ఇక రోహిత్ తో కూడా అదే వరస. ఈసారి ధర్మసేనతో పాటు రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు.

Scroll to load tweet…

ధర్మసేన ఫోటోపై నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ లోకంలో అన్నీ అశాశ్వతమే ఒక్క కుమార ధర్మసేన సెల్పీ మాత్రమే శాశ్వతం..’, ‘ఐసీసీ ట్రోఫీ నెగ్గామా..? లేదా..? అన్నది కాదు ధర్మసేనతో సెల్ఫీ దిగామా లేదా..? అన్నదే అసలు మ్యాటర్..’, ‘కుమార ధర్మసేన నవ్వు ప్రతీ ఐసీసీ టోర్నీ ఫైనల్ కు పెరుగుతోంది..’అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Scroll to load tweet…

Scroll to load tweet…