రింకూ సింగ్ తో పెట్టుకుంటే అంతే మ‌రి.. !

KKR vs DC : బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను 106 ప‌రుగుల తేడాతో చిత్తుచేసింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్ ను తునాతున‌క‌లు చేస్తూ కేకేఆర్ యంగ్ ప్లేయ‌ర్ రింకూ సింగ్ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.
 

Rinku Singh smashes Anrich Nortje with 3 sixes and a boundary in a row KKR vs DC IPL 2024 RMA

Rinku Singh : విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2024 16వ మ్యాచ్ లో కోల్ క‌తా బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సునీల్ న‌రైన్, బైభ‌వ్ అరోరా మెరుపులు, చివ‌ర‌లో ఆండ్రీ రస్సెల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్, రెచ్చిపోయిన‌ రింకు సింగ్ ఇన్నింగ్స్ ల‌తో కేకేఆర్ మ్యాచ్ మొత్తం పూర్తి అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. కేకేఆర్ ఛేజింగ్ కోసం డీసీకి 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బ్యాటింగ్ తడబడుతూ చివరికి 166 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)ని 106 పరుగులతో ఓడించింది.

ఈ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు యంగ్ ప్లేయ‌ర్ రింకూ సింగ్ అద్భుత‌మైన ఫినిషింగ్ ఇచ్చాడు. కొద్దిసేపే క్రీజులో ఉన్నా.. అద్భుత‌మైన షాట్స్ ఆడుతూ.. ఫోర్లు, సిక్స‌ర్ల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో  రింకు సింగ్ అన్రిచ్ నార్ట్జే బౌలింగ్ ను చిత‌క్కొట్టాడు. వ‌రుస‌గా మూడు సిక్స‌ర్ల‌తో పాటు ఒక క్రంచింగ్ ఫోర్ కొట్టి దుమ్మురేపాడు. కేకేఆర్ టోటల్‌ను 272 భారీ స్కోరుకు తీసుకెళ్ల‌డంతో రింకూ ఆడిన ఈ చివ‌రి ఇన్నింగ్స్ కీలకంగా మారింది.

 

ఈ సీజ‌న్ లో గౌతమ్ గంభీర్ వ్యూహాలు కోల్ క‌తాకు మంచి ఫ‌లితాల‌ను అందిస్తున్నాయి. ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ అత్యుత్తమ బ్యాటింగ్ తో దుమ్మురేప‌డం వెనుక గంభీర్ వ్యూహం క‌నిపించింది. 2017లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కూడా నరైన్ ఓపెనింగ్ పాత్ర‌లో మెరిశాడు. ఇప్పుడు కేకేఆర్ కు గంభీర్ మెంటార్, అత‌ని ప్రభావం ఆట‌గాళ్ల‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ కేవలం 39 బంతుల్లో 85 పరుగులు (స్ట్రైక్ రేట్ 217.9) చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 బౌండరీలు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో కేకేఆర్ భారీ స్కోర్ చేయ‌డంతో పాటు106 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. నరైన్ 85, అంగ్క్రిష్ రఘువంశీ 54, రింకూ 26 పరుగులతో కేకేఆర్ కు 272/7 పరుగులు అందించాడు. బౌలింగ్ తోనూ కేకేఆర్ ఢిల్లీని   ఉక్కిరిబిక్కిరి చేసింది. దీతో 166 పరుగులకు ఢిల్లీ ఆలౌట్ అయింది. రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ వరుసగా అర్ధశతకాలు సాధించాడు. వరుణ్ చక్రవర్తి , అరోరాలు తలో 3 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు సాధించాడు.

విధ్వంస‌క ప్లేయ‌ర్ వ‌స్తున్నాడు.. ముంబై ఇండియ‌న్స్ కు గుడ్ న్యూస్.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios