Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై యుద్ధానికి సాయంగా రూ.45 కోట్లు ప్రకటించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

దేశంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ కేర్ సంబంధిత నిర్మాణాల కోసం రూ.45 కోట్లు విరాళం...

ఆసుపత్రుల్ల బెడ్‌లను, ఆక్సిజన్ కాన్సేంట్రేటర్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటన..

RCB Owner Diageo India donates 45 Crore Rupees to Covid relief CRA
Author
India, First Published May 24, 2021, 4:21 PM IST

కరోనా సెకండ్ వేవ్ కేసులతో అల్లాడిపోతున్న దేశానికి మద్ధతుగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ముందుకొచ్చింది. ఆర్‌సీబీ మాతృసంస్థ అయిన డియాగో కంపనీ, దేశంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ కేర్ సంబంధిత నిర్మాణాల కోసం రూ.45 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది.

21 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నిర్మించిన ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ ఓనర్లు, మరో 15 నగరాల్లో బెడ్ల కెపాసిటీని పెంచేందుకు వీలుగా 16 మినీ బెడ్ హాస్పటిల్ యూనిట్లను కూడా ఏర్పాటుచేశారు.

విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు డియగో ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ క్రిపాలు. ప్రతీ రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆసుపత్రి బెడ్‌లను, ఆక్సిజన్ కాన్సేంట్రేటర్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపాడు ఆనంద్.

Follow Us:
Download App:
  • android
  • ios