ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్, దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులను కూడా చలించిపోయాడు.  కరోనాతో బాధపడుతున్న రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు 52 లక్షల రూపాయలు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్న ప్యాట్ కమ్మిన్స్‌ను ఐపీఎల్ 2020 వేలంలో రూ.15 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 2021 సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో  బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్, విజయం కోసం ఆఖరి దాకా పోరాడి క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు.

ఇప్పుడు ఈ విరాళంతో సామాన్య ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నాడు ఆసీస్ స్టార్ పేసర్.