Hardik Pandya: ఐపీఎల్‌కూ దూరం కానున్న హార్దిక్ పాండ్యా .. ముంబైకి కెప్టెన్‌గా ఎంపికై , అంతలోనే ఇలా
ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితులైన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా చీలమండ గాయం కారణంగా రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)కి దూరమయ్యే అవకాశం వుంది.
ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితులైన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా చీలమండ గాయం కారణంగా రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)కి దూరమయ్యే అవకాశం వుంది. 30 ఏళ్ల పాండ్యా.. గుజరాత్ టైటాన్స్‌లో రెండేళ్ల పాటు కొనసాగిన తర్వాత ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చిన అతను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టైటాన్స్‌లో రెండు సీజన్‌లలో హార్డిక్ 30 ఇన్నింగ్స్‌లలో 41.65 సగటుతో 133.49 స్ట్రైక్ రేట్‌తో 833 పరుగులు చేశాడు. అలాగే 8.1 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.
అయితే ముంబై ఇండియన్స్‌కి పాండ్యా తిరిగి రావడం సంచలనం సృష్టించింది. కానీ రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ఉండటంతో క్రికెట్ అభిమానుల నుంచి వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పాండ్యా చివరి 25 టీ20లలో 13 వాటిలో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో చీలమండ గాయంతో అతను మెగా టోర్నీకి దూరమయ్యాడు. నాయకత్వ మార్పు తమ భవిష్యత్తు ప్రణాళికలో భాగమని ముంబై ఇండియన్స్ పేర్కొంది. టోర్నమెంట్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సారథితో సమానంగా విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచారు.
హార్డిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తోనే ప్రారంభించాడు. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.10 లక్షలకు సేల్ అయ్యాడు. 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ సీజన్‌లలో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు.