క్రికెట్ అభిమానుంలతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు మరెంతొ  దూరంలో లేదు. గత కొన్ని నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉంటూ వస్తున్న  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ... మరో ఐదు రోజుల్లో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

త్వరలో ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ లో ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ధోనీ తన ఆటను తిరిగి ప్రారంభించనున్నాడు. వచ్చే నెల 2వ తేదీన ధోనీ మైదానంలో సందడి చేయనున్నారు.

మార్చి చివర్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా... ఇప్పటికే చెన్నైసూపర్ కింగ్స్ తన సన్నాహాలు తాను ప్రారంభించేసింది. ఇప్పటికే సీనియర్ క్రికెటర్లు సురేష్ రైనా, అంబటి రాయుడులతోపాటు మరికొందరు  మూడు వారాలుగా ఈ సీజన్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. వీరితో మార్చి 2వ తేదీన ధోనీ కూడా కలవనున్నారు.

Also Read ఆల్ రౌండర్ షో తో అదరగొట్టిన జూనియర్ ద్రవిడ్... బ్యాట్ పట్టాడంటే సెంచరీలే...

రెండు వారాల కఠోర సాధన తర్వాత ధోనీ చిన్న విరామం తీసుకుంటారు. అనంతరం అదే నెల 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ క్యాంప్ లో పాల్గొంటాడని సీఎస్కే నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రాక్టీస్ సెషన్ కి ధోనీ వస్తున్నాడనే విషయం తెలియగానే... ఆయనను చూడటానికి అభిమానులు వేలాది మంది తరలివస్తుండటం గమనార్హం. ఇక రానున్న ఐపీఎల్‌ సీజన్‌ ధోని ఎంతో కీలకమైంది. 

ఈ టోర్నీలో సత్తా చాటి తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు... అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సారి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటివరకు మూడు సార్లు చాంపియన్‌, ఐదు సార్లు రన్నర్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సారి జట్టులో పలు కీలక మార్పులు చేపట్టింది.