టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు ఐపీఎల్ లో అదరగొడతోంది. వరసగా జైత్ర యాత్రలు కొనసాగిస్తోంది. కాగా... కాస్త విరామంలో తన ముద్దుల కుమార్తె జీవాతో గడుపుతున్నారు. జీవాతో కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఆ ఫోటోలను జీవా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా... అది వైరల్ అవుతోంది.

కాగా.. ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరికి జీవా జన్మించింది. సాక్షి... అప్పుడప్పుడు.. తన కుమార్తెకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఆ తర్వాత జీవాకంటూ ప్రత్యేకంగా ఓ ఎకౌంట్ తెరిచారు. దానిలోనే జీవాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అందులో ఇప్పుడు ధోనీతో కలిసి జీవా దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యహరిస్తున్నాడు. ఈ జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలతో టాప్ లో ఉండగా.. దాని తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం విశేషం.