టీ20 వరల్డ్‌కప్‌కి ముందు సంచలన ప్రకటన చేసిన పీసీబీ కొత్త అధ్యక్షడు రమీజ్ రాజా... హెడ్‌కోచ్‌గా మాథ్యూ హెడెన్, బౌలింగ్ కోచ్‌గా ఫిలందర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. టోర్నీకి జట్టును ప్రకటించిన రెండు గంటల్లోనే పీసీబీ హెడ్‌కోచ్ మిస్బా వుల్‌ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...

తాత్కాలికంగా ఇద్దరు కోచ్‌లను నియమించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు... హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ లెజెండరీ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హెడెన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... 

వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చిన మాథ్యూ హెడెన్‌, పాకిస్తాన్ జట్టు కోచ్‌గా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచే బాధ్యతలు తీసుకోబోతున్నాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను ఎంపిక చేసింది...

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజా... తన మొదటి మీటింగ్‌లోనే ఈ సంచలన ప్రకటన చేయడం విశేషం... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాకి హెడ్ కోచ్‌గా జస్టన్ లాంగర్‌ వ్యవహరిస్తుంటే, అతనికంటే వంద రెట్లు మెరుగైన రికార్డు ఉన్న మాథ్యూ హెడెన్, పాకిస్తాన్‌కి హెడ్‌కోచ్‌గా ఉండబోతున్నాడు. మాథ్యూ హెడెన్ ఎంట్రీతో పాకిస్తాన్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.