ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసినా అభిమానులు ఇంకా ఆ లోకం నుండి బయటకు రాలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అంతెందుకు ఆటగాళ్ళు కూడా ఇంకా ఐపిఎల్ ఫీవర్ నుండి బయటకు రాలేదు. అందువల్లే తాజా ఐపిఎల్ పై రోజుకో విధమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఐపిఎల్ లో గొప్ప కెప్టెన్ ఎవరన్నదానిపై ప్రధానంగా చర్చ మొదలయ్యింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసినా అభిమానులు ఇంకా ఆ లోకం నుండి బయటకు రాలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు అంతెందుకు ఆటగాళ్ళు కూడా ఇంకా ఐపిఎల్ ఫీవర్ నుండి బయటకు రాలేదు. అందువల్లే తాజా ఐపిఎల్ పై రోజుకో విధమైన చర్చ జరుగుతోంది. తాజాగా ఐపిఎల్ లో గొప్ప కెప్టెన్ ఎవరన్నదానిపై ప్రధానంగా చర్చ మొదలయ్యింది.
అయితే ఏ జట్టుకు చెందిన అభిమానులు తమ కెప్టెనే గొప్పవాడంటూ వాదనకు దిగుతున్నారు. దీంతో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఐపిఎల్లో గొప్ప కెప్టెన్ ఎవరో శాస్త్రీయంగా నిర్ణయించడానికి ప్రయత్నించాడు. వ్యక్తిగత ఆటతీరు, జట్టును ముందుంచి నడిపించిన విధానం, క్లిష్ట సమయాల్లో తీసుకున్న సక్సెస్ ఫుల్ నిర్ణయాలు, బాధ్యతలను మీదేసుకున్న విధానం తదితర అంశాల ఆధారంగా కెప్టెన్లను గ్రేడ్ల వారిగా విభజిస్తూ...వారికెందుకు ఇన్ని మార్కులు ఇవ్వాల్సివచ్చిందో వివరణ కూడా ఇచ్చాడు.
అందరూ ఊహించినట్లే మంజ్రేకర్ ప్రకటించిన అత్యుత్తమ కెప్టెన్లు లిస్టులో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని ముందున్నాడు. అతడికి మంజ్రేకర్ 10కి తొమ్మిది మార్కులు వేశాడు. ఆ తర్వాత నాలుగో సారి ముంబై ఇండియన్స్ కి ఐపిఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మకి చోటు దక్కింది. అతడికి 10కి ఎనిమిది మార్కులు లభించాయి. రోహిత్ నిలకడైన కెప్టెన్ అని....ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జట్టును ముందుండి నడిపించాడని పేర్కోన్నారు. అంతేకాకుండా ఏ ఆటగాన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో తెలిసిన తెలివైన కెప్టెన్ అని మంజ్రేకర్ ప్రశంసించారు.
ఇక ఆ తర్వాతి స్థానంలో డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. అతడు 10 కి 8 మార్కులు అందుకుని రోహిత్ తో సమానంగా నిలిచాడు. కెప్టెన్ గానే కాదు ఆటగాడిగా కూడా అతి తక్కువ అనుభవమున్నా...అతడు జట్టును ముందుండి నడిపిన తీరు అద్భుతంగా వుందన్నాడు. అతడి ప్రోత్సాహంతో యువ ఆటగాళ్లు చెలరేగడంతో ప్లేఆఫ్ కు చేరుకున్న తీరు బావుందన్నారు, అందువల్లే అతడికి 8 మార్కులు ఇచ్చినట్లు మంజ్రేకర్ తెలిపారు.
కింగ్స్ లెవెన్ పంజాబ్ కెప్టెన్ 10 కి 7 మార్కులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. సన్ రైజర్స్ కెప్టెన్ విలిమ్సన్ కూడా 7 మార్కులతో అశ్విన్ తో సమానంగా నిలిచాడు. అందరికంటే చివరి స్థానంలో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచారు. వీరిద్దరికి మంజ్రేకర్ 10 కి 6 మార్కులు మాత్రమే ఇచ్చాడు. వీరికంటే తక్కువ మార్కులతో రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే కు 5 మార్కులు లభించగా, కెకెఆర్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ గురించి మంజ్రేకర్ అసలు ప్రస్తావించలేదు. ఇలా మంజ్రేకర్ మార్కుల ద్వారా కెప్టెన్ల ప్రదర్శనను వివరించడంపై అభిమానుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.
