Lanka Premier League 2023: లంక ప్రీమియర్ లీగ్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా మైదానంలోకి ఓ పాము ప్రవేశించి.. కలకలం సృష్టించింది.
Lanka Premier League 2023: శ్రీలంకలో టీ20 ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. లంకతొలి మ్యాచ్ ఆదివారం జరిగింది. టోర్నీ రెండో రోజు (సోమవారం) మైదానంలో వింత ఘటన చోటుచేసుకుంది. లీగ్ లో భాగంగా గాలే టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పాము మైదానంలోకి ప్రవేశించింది. దీంతొ ఆటగాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పామును తరిమికొట్టిన ఫోర్త్ అంపైర్
మైదానంలో పాము రావడంతో ఆటను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది. కొందరూ ఆటగాళ్లు భయంతో పరుగులు దీశారు. చాలా మంది ఆటగాళ్లు పామును చూడటానికి కూడా జంక్కారు. ఎవరూ కూడా పామును దగ్గర నుంచి చూడటానికి సాహసించలేదు. అలాంటి పరిస్థితిలో ఫోర్త్ అంపైర్ ముందుకు వచ్చి పామును తరిమి కొట్టాడు. పాము మైదానం వెలుపలికి వెళ్లిన తర్వాత మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
సూపర్ ఓవర్‌లో గాలె విజయం
గాలె, దంబుల్లా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఇందులో భానుక రాజపక్సే 48 పరుగులు చేయగా, కెప్టెన్ దసున్ షనక 42 పరుగులు చేశాడు. 21 బంతుల్లో షనక 4 సిక్సర్లు బాదాడు. అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన దంబుల్లా టీం కూడా దంచికొట్టింది. నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. దీంతో స్కోర్ లెవల్ అయ్యాయి. బౌలింగ్‌లో షనక కూడా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. స్కోర్ లెవల్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. కుషన్ రజితపై దంబుల్లా కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. భానుక రాజపక్సే రెండు బంతుల్లో 10 పరుగులు చేసి గాలెకు టోర్నీలో తొలి విజయాన్ని అందించారు.
