ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్) 2019లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ జట్టులో రాహుల్ 1, గేల్ 20, అగర్వాల్ 58, ఖాన్ 13, మిల్లర్ 58, మన్‌దీప్ సింగ్ 33 పరుగులు చేశారు.

ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్ మెన్స్ చెలరేగిపోయారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు నిర్థీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్ నరైన్ పరుగుల సునామీని మొదలుపెట్టగా ఊతప్ప, నితీశ్ రానా, రస్సెల్స్ దాన్ని కొనసాగించారు. నరైన్ 24 పరుగులు కేవలం 9 బంతుల్లోనే, రానా 63 పరుగులు 34 బంతుల్లో, ఊతప్ప 50 బంతుల్లో 67 నాటౌట్, రస్సెల్స్ 17 బంతుల్లో 48 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. 

పంజాబ్ బౌలర్లలో షమీ, వరుణ్, విల్జిన్, టై ఒక్కో వికెట్ పడగొట్టారు. కానీ పంజాబ్ బౌలర్లందను భారీగా పరుగులు సమర్పించుకుని కోల్ కతా బ్యాట్ మెన్స్ ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. అత్యధికంగా పంజాబ్ కెప్టెన్ అశ్విన్ 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతడు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 

పరుగుల సునామీతో కాస్సేపు పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న కోల్ కతా బ్యాట్ మెన్ నితీశ్ రానా ఔటయ్యాడు. కేవలం 34 బంతుల్లోనే 63 పరగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతడు చివరికి వరుణ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  

ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా పరుగుల సునామీ పారిస్తోంది. కేవలం 11 ఓవర్లకే ఆ జట్టు సెంచరీ మార్కును దాటింది. రాబిత్ ఊతప్ప(41 పరుగులు 31 బంతుల్లో) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అతడికి తోడుగా నీతిశ్ రానా కూడా 41  పరుగులు 21 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరు రెచ్చిపోయి ఒకరితొ ఒకరు పోటీ పడుతూ బౌండరీలు బాదుతున్నారు. 

సొంత మైదానంలో భారీ షాట్లతో విరుచుకుపడ్డ సునీల్ నరైన్ ఇన్నింగ్స్ బ్రేక్ పడింది. వేగంగా ఆడుతూ కేవలం 9 బంతుల్లోనే 24 పరుగులు చేసిన అతడు మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 

ధాటిగా ఇన్సింగ్స్ ప్రారంభించిన కోల్ కతా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు  చేరాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ కళ్లుచెదిరే షాట్లతో ఆకట్టుకోవడంతో(6 బంతుల్లో 24) కోల్ కతా స్కోరు పరుగులు పెట్టింది. 

ఐపిఎల్ 2019 లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్- కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేధికగా  జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కతా సొంత మైదానంలో మొదట బ్యాటింగ్ కు దిగింది 

కోల్‌కతా జట్టు: 

క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిత్ ఊతప్ప, నితీశ్ రానా, శుభ్ మన్ గిల్, ధినేశ్ కార్తిక్(కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, పీయూశ్ చావ్లా, కుల్దీప్ యాదవ్, పెర్గ్ సన్, ప్రసిద్ కృష్ణా

పంజాబ్ జట్టు: 

క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్,, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్ ధీప్ సింగ్, ఆండ్రూ టై, అశ్విన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, హర్దుస్ విల్జిన్, వరుణ్ చక్రవర్తి