ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్‌కి అవకాశం:... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచి, రెండింట్లో పరాజయాలు చవి చూడగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచులు ఆడి 3 విజయాలు అందుకుంది, రెండింట్లో పరాజయం పాలైంది...

గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓడినప్పటికీ టాపార్డర్ ఫెయిల్ అయినా 190+ పరుగులు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

వరుసగా రెండు పరాజయాల తర్వాత కోల్‌కత్తా నైట్‌‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌తో పాటు ఖలీల్ అహ్మద్‌ కూడా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్... ఆశించిన పర్ఫామెన్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు. 

మిచెల్ మార్ష్‌ గాయం నుంచి కోలుకుని జట్టుకి అందుబాటులో రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. రెండు మ్యాచుల్లో తుది జట్టులో చోటు కల్పించినా ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్ టీమ్‌లోకి రావడం విశేషం. సోదరి ఆకస్మిక మృతితో జట్టుకి దూరమైన హర్షల్ పటేల్, తిరిగి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లిసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సూయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ 

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రోవ్‌మెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహ్మన్, ఖలీల్ అహ్మద్