మరీ ముఖ్యంగా కోల్‌కతా రూ.15.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఘోరంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్ ఏకంగా 16.30 ఎకానమీతో 49 రన్స్ సమర్పించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఐపీఎల్ 2020 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.కాగా.. బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తొలి బోణి కొట్టింది. భారీ అంచనాల నడుమ మైదానంలోకి అడుగుపెట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ చిత్తుగా ఓడిపోయారు. 49 పరుగుల భారీ తేడాతో కోల్ కతా భారీ ఓటమిని చవిచూసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మరీ ముఖ్యంగా కోల్‌కతా రూ.15.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఘోరంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కమిన్స్ ఏకంగా 16.30 ఎకానమీతో 49 రన్స్ సమర్పించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్.. కెప్టెన్ రోహిత్ శర్మ (80: 54 బంతుల్లో 3x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయినప్పటికీ.. పవర్ హిట్టర్లు ఆండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్ ఉండటంతో కోల్‌కతా ధీమాతోనే లక్ష్యఛేదనని ఆరంభించింది. 

Scroll to load tweet…
Scroll to load tweet…

కానీ.. ముంబయి అగ్రశ్రేణి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఒకే ఓవర్‌లో రసెల్ (11), మోర్గాన్ (16)లను ఔట్ చేసి కోల్‌కతా ఆశలపై నీళ్లుచల్లాడు. అప్పటి వరకూ రసెల్ బ్యాటింగ్‌ కోసం ఎదురుచూసిన అభిమానులు.. తమ నిరాశని సోషల్ మీడియాలో ఫన్నీగా వ్యక్తపరుస్తున్నారు. ముంబయి ఇండియన్స్ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూనే.. కోల్ కతా ఓటమిపై ఫన్నీ ట్రోల్స్ చేస్తుండటం విశేషం.