Asianet News TeluguAsianet News Telugu

IPL 2024: ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు

Hardik Pandya: ఒకప్పుడూ చెన్నైకి రైనా.. ఆర్సీబీకి ఏబీడీకి ఇన్ఫ్యాట్ ప్లేయర్స్ గా ఉండేవారు. వాళ్ల ఇన్ఫ్యాట్ తో టీం రిజల్ట్స్ నే మార్చేవారు. ఆ కోవకు చెందిన వాడే ముంబై టీమ్ హార్దిక్ పాండ్యా.. ఆ ఫ్లేయర్స్ లాగా బ్యాటింగ్ చేయడమే కాదు. మనోడు బౌలింగ్,ఫిల్డింగ్ లో రాణించే ఆల్ రౌండర్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ముంబైకి  హర్థిక్ పాండ్యా ఓ ట్రంప్ కార్డ్. ముంబాయి జట్టులో ఎంతమంది హర్డ్ హిట్టర్స్ ఉన్నా కానీ, పాండ్యాది ప్రత్యేక స్థానం. కపిల్ దేవ్ తరువాత ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు హర్దిక్ పాండ్యా. కానీ గతంలో పొగడ్తలతో ముంచెత్తినవారే.. నేడు ఛీత్కారించుకుంటున్నారు. ఎందుకు హార్దిక్ పాండ్యాపై ద్వేషం పుట్టిందో తెలుసుకుందాం. 

IPL 2024 Why does Everyone Hates Hardik Pandya? KRJ
Author
First Published Apr 4, 2024, 6:50 PM IST

Hardik Pandya: IPL 2024లో ముంబై ఇండియన్స్ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. సొంత మైదానంలో పాటు ఆడినా మూడు మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. కాగా..ఈ సీజన్ ప్రారంభం నుంచి రోహిత్ శర్మ బదులు హార్థిక పాండ్యా ముంబైకి సారథ్యం వహిస్తున్నారు. అంతముందు  రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో హార్థిక పాండ్యా ఆడారు. ముంబాయి జట్టులో ఎంత మంది హర్డ్ హిట్టర్స్ ఉన్నా.. పాండ్యా కు ప్రత్యేక గుర్తింపు. బ్యాటింగ్ , ఫిల్డింగ్, బౌలింగ్ ల్లో రాణించి ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, రోహిత్ స్థానంలో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు అనుభవజ్ఞులైన సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు సారధ్యం వహించారు. ఇలా సక్సెస్ పుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మని తొలగించడం మాత్రం ఎంఐ అభిమానులకు అసలు నచ్చలేదు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఎంఐ ఫ్యాన్స్. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. గత వారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిమానులు హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేశారు. ఈ మ్యాచ్‌లో పాండ్యాపై విపరీతమైన ట్రోల్ చేశారు. వాస్తవానికి ఈ సీజన్ లో హార్దిక్ గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. హార్దిక్ 2022లో తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. ఆ తరువాత 2023లో ఆ జట్టును ఫైనల్‌కు చేరుకుంది. 

కానీ, ఈ సీజన్లో హార్దిక్ సారధ్యంలో ముంబై వరుసగా ఫెల్యూర్ అవుతోంది. పైగా.. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చుకున్న జట్టుగా ముంబై చెత్త రికార్డును మూటగట్టుకుంది. అలాగే.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ సీజన్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఈ గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించి ఆ స్థానంలో హార్దిక్ పాండ్య రావడంతో  అటు  ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ అభిమానులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.రాజస్థాన్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లోనైతే ప్రేక్షకులు మరింతగా రెచ్చిపోయారు. టాస్ వేసే సమయంలో కూడా హార్దిక్ పాండ్యను ఫ్యాన్స్  ట్రోల్ చేస్తూనే కనిపించారు.  

ఈ మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ ట్రోల్ చేయడం గమనించినా  మ్యాచ్ ప్రజెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..  అలా చేయడం అది సరికాదు అన్నట్టుగా మాట్లాడాడు. దీంతో ఫ్యాన్ మరింతగా రెచ్చిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ మరింత గట్టిగా అరిచారు. మంజ్రేకర్ ప్రేక్షకులను ఉద్దేశించి బిహేవ్ అని అనడంతో.. హార్దిక్ చిరునవ్వు నవ్వాడు. అయితే.. మంజ్రేకర్‌ను కూడా కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం గమనార్హం. పాండ్యా బ్యాటింగ్ కు వచ్చి.. ఫోర్లు కొట్టినప్పుడు మాత్రమే ఈ ట్రోలింగ్ చప్పట్లుగా మారాయి. కానీ ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమిని ఎదుర్కోవడంతో ఆ ట్రోల్స్ మరింత పెరిగాయి.  

ట్రోల్స్ పై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అభిమానుల ప్రవర్తనకు మందలించాడు. ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ప్రతి ఆటగాడు దేశం కోసమే ఆడుతాడని , ఆ విషయాన్ని అభిమానులు గుర్తించాలని అన్నారు. ఫ్యాన్స్ ఎప్పుడూ ఇలాంటి చెడు మార్గం వైపు ప్రయాణించుకూడదని పేర్కొన్నాడు రవిచంద్రన్ ఆశ్విన్. ఆయన గతంలోని కొన్ని ఘటనలను ఉటంకిస్తూ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఎక్కడా ఫ్యాన్ వార్ లేకుండా ఒకరి కెప్టెన్సీలో ఆడారని అశ్విన్ గుర్తు చేశారు.

అలాగే.. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోనూ ఆడారు. అలాగే..  ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా మంది సినీయర్ ఆటగాళ్ల ఆడారనీ, ధోనీ కూడా విరాట్ కోహ్లి కెప్టెన్సీలోనే ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం సరికాదనీ, ఇలా పోరాడతారా అని అశ్విన్ అడిగాడు.

అలాగే.. జో రూట్ , జాక్ క్రాలీ అభిమానులు తమలో తాము పోరాడుకోవడం మీరు చూశారా? లేక జో రూట్,  జోస్ బట్లర్ అభిమానులు పోరాడుతున్నారా? ఇది పిచ్చితనం. ఆస్ట్రేలియాలో పాట్ కమిన్స్ అభిమానులతో స్టీవెన్ స్మిత్ అభిమానులు పోరాడడం మీరు చూశారా?" రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా తన పాత సహచరుడు పాండ్యాకు మద్దతు ఇచ్చాడు.  అలాంటి ట్రోలింగ్‌లను పట్టించుకోవద్దని సూచించారు. 

ఈ విషయంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ శారదా ఉగ్ర మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యాపై ట్రోల్స్ జరగడం చాలా అరుదు. స్టేడియంలోని వివిధ స్టాండ్‌లలో ఆటగాళ్లను అభిమానులు ఆటపట్టించారు, కానీ ఈ విధంగా వరుసగా.. ఒక గ్రౌండ్ నుండి మరొక గ్రౌండ్‌కి ,ముంబై హోమ్ గ్రౌండ్‌లో కూడా ట్రోల్స్ జరగడం సాధారణ విషయం కాదు. ఇది సోషల్ మీడియా ద్వారా సృష్టించబడిందని నేను భావిస్తున్నాను. ఇది దాదాపుగా ముంబై ఇండియన్స్ ప్రతి గేమ్‌లో ట్రెండ్‌గా మారింది."అని అన్నారు.

ముంబయి, పాండ్యా కెప్టెన్సీ మార్పుపై ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వెళుతున్నప్పుడు ప్రీ-సీజన్ విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో హార్దిక్ పాండ్యా తన కాంట్రాక్ట్‌లో కెప్టెన్సీకి సంబంధించి ప్రశ్నించగా..  పాండ్యా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. అదేవిధంగా.. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం వెనుకున్న కారణాన్ని ప్రధాన కోచ్ మార్క్ బౌచర్‌ను అడగ్గా అతను మౌనం వహించాడు. ఏదిఏవైనా.. హర్థిక్ పాండ్యా.. తన బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్సీలో రాణించి, ముంబై ఇండియన్స్‌ను విజయపథంలో నడిపిస్తే..ఈ రోజు వెక్కిరించేవారే.  ఆ రోజు కీర్తిస్తున్నారు. ఆ ఫ్యాన్సే ప్రశంస్తారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios