IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్... మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్ లేకుండా లక్నో సూపర్ జెయింట్స్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు లక్నోలోని భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన మొదటి 9 మ్యాచుల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మార్క్‌రమ్ మాత్రం తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపడం విశేషం..
ఇదే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పోరాడి ఓడింది..
మరోవైపు తొలి మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే మొదటి మ్యాచ్‌కి అందుబాటులో లేని కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌తో పాటు హెన్రీచ్ క్లాసిన్, మార్కో జాన్సన్ వంటి స్టార్ ప్లేయర్లు నేటి మ్యాచ్‌లో ఆడబోతున్నారు..
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హారీ బ్రూక్‌తో పాటు భారీ అంచనాలు పెట్టుకున్న మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు..
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎక్కువగా కైల్ మేయర్స్‌పైనే ఆధారపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో కలిపి 126 పరుగులు చేసిన కైల్ మేయర్స్, ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అతన్ని త్వరగా అవుట్ చేస్తే లక్నో సూపర్ జెయింట్స్‌ని స్వల్ప స్కోరుకి కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...
తొలి రెండు మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. గత మూడు సీజన్లలో ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన నికోలస్ పూరన్, ఈసారి బాగానే ఆడుతున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్నారు..
బౌలింగ్‌లో మొదటి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన మార్క్ వుడ్, రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. అయితే జ్వరంలో బాధపడుతున్న మార్క్ వుడ్ నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు. ఆవేశ్ ఖాన్ కూడా నేటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. . ఐపీఎల్‌లో అత్యంత భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మొదటి మ్యాచ్‌లో ఆ స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది...
సీనియర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్, వాషింగ్టన్ సుందర్ భారీగా పరుగులు సమర్పించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, రొమారియో షిఫర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్,జయ్‌దేవ్ ఉనద్కట్, రవి భిష్ణోయ్
