Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ కొనసాగాలి... ప్రస్తుతం అది చాలా ముఖ్యం.. మైకేల్ వాగన్

ప్రజలు ఆస్పత్రులకు వెళ్లలేక, వెళ్లినా బెడ్లు లభించక, ఆక్సిజన్ దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే ఐపీఎల్ అవసరమా? అసలు ప్రభుత్వం, ఫ్రాంచైజీలు, కంపెనీలకు ప్రజలు కష్టాలు పట్టవా? అంటూ మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. 

IPL 2021: Michael Vaughan Supports Continuation of IPL, Faces Ire on Twitter
Author
Hyderabad, First Published Apr 29, 2021, 8:56 AM IST

భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో.. ఐపీఎల్ నిర్వహించడం అవసరమా...? దాని కోసం కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రజలు ఆస్పత్రులకు వెళ్లలేక, వెళ్లినా బెడ్లు లభించక, ఆక్సిజన్ దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే ఐపీఎల్ అవసరమా? అసలు ప్రభుత్వం, ఫ్రాంచైజీలు, కంపెనీలకు ప్రజలు కష్టాలు పట్టవా? అంటూ మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. 

 

అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. ఐపీఎల్ కొనసాగాలని, ఇది ప్రతిరోజూ సాయంత్రం వందలకోట్ల మందికి సంతోషం పంచుతోందని పేర్కొన్నాడు. ‘‘ఐపీఎల్ కొనసాగాలనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కష్టకాలంలో వందలకోట్ల మందికి ఈ టోర్నీ పంచే సంతోషాలు చాలా ముఖ్యం’’ అని వాగన్ అన్నాడు. అయితే సౌతాఫ్రికాలో మ్యాచులు ఆడటానికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అంగీకరించలేదు. తమ జట్లను వెనక్కు పిలిపించేసుకున్నాయి. మరి అలాంటప్పుడు ఆటగాళ్లను భారత్‌లో ఆడనిస్తున్నారని, ఇదే తనకు అర్థంకాని విషయమని మాత్రం వాగన్ విమర్శించాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios