Asianet News TeluguAsianet News Telugu

ఓడిపోవడంలో బాగు ఏముంటుంది.. కేఎల్ రాహుల్ అసంతృప్తి

మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కాగా... ఆ సమయంలో.. మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బ్యాటింగ్ లో మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు.

IPL 2021: 'I Really Don't Know What to Say' - KL Rahul After PBKS' Fourth Loss in Six Games
Author
Hyderabad, First Published Apr 27, 2021, 9:29 AM IST

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి మరో ఓటమి ఎదురైంది. సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో... పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో... ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఓడిపోయిన జట్టుకి బాగుండటం ఏముంటుందంటూ నిర్లిప్తంగా మాట్లాడటం గమనార్హం. ఇప్పటి వరకు పంజాబ్ ఆరు మ్యాచ్ లు ఆడగా.. అందులో నాలుగు ఓడిపోయి.. కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. వరస ఓటములు కేఎల్ రాహుల్ ని మరింత కుంగతీసినట్లు అతని మాటల్లో స్పష్టంగా అర్థమౌతోంది.

మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కాగా... ఆ సమయంలో.. మాట్లాడిన కేఎల్ రాహుల్.. ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బ్యాటింగ్ లో మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు.

ఓటమి చెందిన జట్టుకు మంచి, బాగు అంటూ ఏమీ ఉండదని తాము ఆడిన తీరుపై అసహనం ప్రదర్శించాడు. ఈ తరహా ప్రదర్శన గురించి ఏమి మాట్లాడాలో తెలియడం లేదని, ఇంకా తాము చాలా మెరుగుపడాలన్నాడు.  

ప్రధానంగా బ్యాటింగ్‌లో ఎంతో నాణ్యమైన ఆటను ప్రదర్శించాలన్నాడు. కొన్ని సాఫ్ట్‌ డిస్మిసల్స్‌ తమ గేమ్‌పై ప్రభావం చూపాయన్నాడు. ఇక్కడ రిస్క్‌ చేసి షాట్లు కొట్టడం చాలా కష్టంగా ఉందన్నాడు. మంచి జట్లు ఇక్కడ పరిస్థితులను తొందరగా అర్థం చేసుకుంటాయన్నాడు. బిష్ణోయ్‌ ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడని, తమ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ వల్లే ఈ తరహా క్యాచ్‌లు పడుతున్నామన్నాడు. జాంటీ తమకు కఠినమైన పరీక్షలు పెడుతుంటాడని వాటికి తాము ఎలా రియాక్ట్‌ అవుతామనే దాన్ని చూసి ఫీల్డింగ్‌ సరిచేస్తూ ఉంటాడన్నాడు. తాము తిరిగి సమష్టిగా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు రాహుల్‌.

కాగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత  మరో విజయాన్ని కేకేఆర్‌ సాధించింది.. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ 47 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆ‍కట్టుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios