Asianet News TeluguAsianet News Telugu

IPL2021:విజయం కోసం పోరాడాలి.. ఓటమిపై రోహిత్ శర్మ..!

 ఈ రెండు ఓటమిలతో ముంబయి ఇండియన్స్ ఆరో స్థానానికి దిగజారింది. ఈ క్రమంలో.. జట్టు ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma) స్పందించారు

IPL 2021: Have to get back and fight, get some wins, says MI captain Rohit Sharma after loss against KKR
Author
Hyderabad, First Published Sep 24, 2021, 10:55 AM IST

ఐపీఎల్ (IPL2021)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకి ఊహించని షాక్ ఎదురైంది. వరస ఓటములు చవిచూస్తున్నాయి. మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలవ్వగా.. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలయ్యింది. ఈ రెండు ఓటమిలతో ముంబయి ఇండియన్స్ ఆరో స్థానానికి దిగజారింది. ఈ క్రమంలో.. జట్టు ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma) స్పందించారు.  జట్టు కోసం  తాము మరింత కష్టపడాల్సి ఉందని.. విజయం సాధించాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నారు.

కాగా.. తాము ఆడిన మైదానం పిచ్ బ్యాటింగ్ కి బాగా అనుకూలించందని.. అయితే.. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా  భారీ స్కోర్ చేయలేకపోయామని కోహ్లీ పేర్కొన్నారు. బౌలింగ్ విషయంలోనూ తమకు ఏదీ కలిసి రాలేదన్నారు. స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేయడం ద్వారా కోల్ కతా బ్యాట్స్ మెన్ లు రిస్క్ లు తీసుకునేలా చేయాలని అనుకున్నామని.. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదన్నారు.

 

అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డికాక్ హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత.. కోల్‌కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో.. ఆ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3తో విజయాన్ని అందుకుంది. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన కోల్‌కతా టీమ్‌కి ఇది నాలుగో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్‌కి ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios