Asianet News TeluguAsianet News Telugu

IPL 2021 CSK Vs RR: టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జోరు మీదున్న చెన్నైని RR నిలువరించేనా..?

IPL 2021 CSK Vs RR: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో భాగంగా మరో కీలక సమరానికి వేళైంది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) తో తలపడుతున్న రాజస్థాన్ రాయల్స్ (rajastan royals) నేటి పోరులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ కీలకపోరులో సంజూశాంసన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు.   నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ ఏకంగా ఐదు మార్పులు చేసింది.

Ipl 2021 csk vs rr Rajasthan royals won the toss and opted to bowl first against cheannai super kings
Author
Hyderabad, First Published Oct 2, 2021, 7:19 PM IST

ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న చెన్నై.. జోరు కొనసాగించాలని చూస్తుండగా ఈ మ్యాచ్ లో అయినా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తున్నది.  పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ కు నేటి మ్యాచ్ లో విజయం సాధించడం అత్యావశ్యకం. ఐపీఎల్ లో ఇరు జట్లు 25 సార్లు పోటీపడగా చెన్నై (csk) 15 సార్లు, రాజస్థాన్ (rr) 10 సార్లు నెగ్గాయి.

పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ధోని (Ms Dhoni) సేన అబుదాబి వేదికగా జరుగుతున్న పోరులో గెలిచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నది. 11 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్..  వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో వైపు రాజస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 11 మ్యాచ్ లు ఆడిన సంజూ శాంసన్ సేన..  నాలుగింటిలో నెగ్గి ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్  రాజస్థాన్ కు గగనమే అయినా తర్వాతి మూడు మ్యాచ్ లు నెగ్గితే అవకాశం ఉంటుంది. అయితే అది ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్న మిగతా మూడు జట్ల  ప్రదర్శన, నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఉంది. 

జట్ల బలబలాల విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో చెన్నై మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బ్రావో స్థానంలో సామ్ కరన్, చాహర్ స్థానంలో కెఎం ఆసిఫ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇక ఆ జట్టు  ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ అదిరే ఆరంభాలు ఇస్తున్నారు. అయితే తర్వాత వచ్చే సురేశ్ రైనా, మోయిన్ అలీ, ధోనిలు మాత్రం విఫలమవుతుండటం ఆ జట్టును కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇదిలాఉండగా ధోనికి కెప్టెన్ గా ఇది 200 వ మ్యాచ్.  

మరోవైపు రాజస్థాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బ్యాటింగ్ లో ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. దీంతో ఆ జట్టు భారీ మార్పులు చేసింది. శివమ్ దూబే, గ్లెన్ ఫిలిఫ్స్, డేవిడ్ మిల్లర్, మయాంక్ మర్కండె, ఆకాశ్ సింగ్ లు తుది జట్టులోకి వచ్చారు. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత ధరకు కొనుక్కున్న క్రిస్ మోరిస్ కూడా ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అతడికి కూడా చోటు దక్కలేదు. 

జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, సామ్ కరన్, మోయిన్ అలీ, డుప్లెసిస్, కెఎం ఆసిఫ్, సురేశ్ రైనా, హెజిల్వుడ్, శార్దుల్ ఠాకూర్
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివం దూబే, ఆకాశ్ సింగ్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గ్లెన్ ఫిలిప్స్

Follow Us:
Download App:
  • android
  • ios