బెంగళూరు,  కోల్‌కత లాక్ మధ్య నేడు జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అబుదాబి పిచ్ వరుస పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కోల్‌కత జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది.   

గత మ్యాచ్‌లో కోల్‌కతకు ఫెర్గుసన్‌ రూపంలో మ్యాచ్‌ విన్నర్‌ లభించగా.. ఆల్‌ టైమ్‌ మ్యాచ్‌ విన్నర్‌ ఏబీ డివిలియర్స్‌ యుఏఈ పిచ్‌లపై విశ్వరూపం చూపిస్తున్నాడు. పరుగులు చేయటం కష్టమవుతున్న పిచ్‌లపై ఏబీ అలవోకగా బౌండరీలు బాదుతున్నాడు.

బెంగళూర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌, అరోన్ ఫించ్‌, విరాట్‌ కోహ్లిలు ఓ ఎత్తు అయితే, ఏబీ డివిలియర్స్‌ ఒక్కడే  మరో ఎత్తు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న డివిలియర్స్‌ను లెగ్‌ స్పిన్‌తో ఆపవచ్చని గత మ్యాచ్‌లో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోల్‌కతకు కుల్దీప్‌‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ ఉన్నారు. ఫెర్గుసన్‌, పాట్‌ కమిన్స్‌ తోడుగా ఈ ఇద్దరు స్పిన్నర్లు డివిలియర్స్‌ను ఏ విధంగా ఆపగలరో చూడాలి.  

ప్లేయింగ్‌ ఎలెవన్‌

కోల్‌కత నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రానా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), బాంటన్‌, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌, లాకీ ఫెర్గుసన్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), గురుకీరత్ మాన్, క్రిస్‌ మోరీస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైని, సిరాజ్‌, యుజ్వెంద్ర చాహల్‌.