Asianet News TeluguAsianet News Telugu

ఇండోర్ టీ20: అలవోకగా... శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం

భారత్- శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

India vs Sri Lanka, 2nd T20I, Live Cricket Updates
Author
Indore, First Published Jan 7, 2020, 6:48 PM IST

ఇండోర్ టీ20లో శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ 45, శిఖర్ ధావన్ 32 పరుగులు చేసి శుభారంభం అందించారు.

ఆ తర్వాత కోహ్లీ 30, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో విజయానికి బాటలు వేశారు.. విజయానికి 8 పరుగుల దూరంలో శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. ఆ తర్వాత లహిరా కుమార బౌలింగ్‌లో సిక్స్ కొట్టి కోహ్లీ భారత్‌కు విజయాన్ని అందించాడు. లంక బౌలర్లలో హసరంగా 2 వికెట్లో పడగొట్టాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

భారత్ విజయానికి అడుగు దూరంలో మూడో వికెట్ కోల్పోయింది. లహిరు కుమార బౌలింగ్‌లో 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యార్ శనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

భారత్ స్వల్ప వ్యవధిలో మరో వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసరంగా బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఎల్బీ డబ్ల్యూ‌గా ఔటయ్యాడు.

టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసరంగా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన ఓపెనర్ లోకేశ్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఇండోర్ టీ20లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ నిలబడలేకపోయారు. నాలుగో ఓవర్‌లో మొదలైన వికెట్ల పతనం చివరి ఓవర్ వరకు కొనసాగడంతో లంక ఎక్కడా కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంకేయులు కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగారు.

శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో కుశాల్ పెరీరా 34 పరుగులతో ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనగా, ఆ తర్వాత వచ్చిన వారు సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. భారత బౌలర్లలో ఎస్ఎన్ ఠాకూర్ 3, నవ్‌దీప్ షైనీ, కుల్‌దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

చివరి ఓవర్లలో స్కోరును పెంచే క్రమంలో శ్రీలంక ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఎస్ఎన్ ఠాకూర్ బౌలింగ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధనుంజయ డిసిల్వా భారీ షాట్‌కు యత్నించి శివమ్ దూబేకు చిక్కాడు.

శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన దాసున్ శనక 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

భారత బౌలర్లు విజృంభిస్తున్నారు వరుసగా వికెట్లు తీస్తూ శ్రీలంక నడ్డి విరిచారు. నవ్‌దీప్ షైనీ బౌలింగ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భానుకా రాజపక్స.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

లంక వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వికెట్ కీపర్ కుశాల్ పెరీరా 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

శ్రీలంక వరుసగా మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఫెర్నాండో స్టంపౌట్ అయ్యాడు. 

శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. నవదీప్ షైనీ వేసిన బంతిని అంచనా వేయడంతో తడబడిన ఓపెనర్ ధనుష్క గుణతిలక 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డయ్యాడు.

లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్ సుందర్ వేసిన 4.5 ఓవర్ తొలి బంతికి ఓపెన్ అవిష్క ఫెర్నాండో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ ఆడి నవ్‌దీప్‌కు షైనీకి చిక్కాడు. 

భారత బౌలర్లు శ్రీలంక బ్యాట్ మెన్స్ ను బెంబేలెత్తిస్తున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు విజృంభించడంతో లంక ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 

భారత్- శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గౌహతిలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన తుది జట్లనే రెండో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తున్నట్లు ఇరు జట్ల కెప్టెన్‌లు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios